Shivraj government : ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?
Shivraj government : ఇకపై ఎవరైనా రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయిస్తే వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించే ప్రతిపాదనకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది

భోపాల్ : కల్తీ మద్యంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు పిడికిలి బిగించింది. కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకునేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం (Shivraj government) కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఎవరైనా రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయిస్తే వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించే ప్రతిపాదనకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సవరించిన బిల్లు ముసాయిదా ఆమోదించారు. ఇందులో కల్తీ మద్యం కారణంగా మరణించినట్లయితే నిందితుడికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించవచ్చు. అలాగే, జరిమానా మొత్తాన్ని కూడా రూ.25 లక్షలకు పెంచారు. అక్రమ మద్యం అమ్మకాలను పట్టుకోవడానికి వచ్చిన ఎక్సైజ్ బృందం లేదా ఇతర దర్యాప్తు బృందంపై దాడి చేసిన సందర్భంలో మూడేళ్ల వరకు శిక్ష విధించనున్నారు.
కల్తీ మద్యం అమ్మకాలను నిరోధించేందుకే ఈ కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. తొలిసారి కల్తీ మద్యం విక్రయిస్తూ దొరికిన వారికి జీవిత ఖైదు విధిస్తారని, రెండోసారి లేదా ఇదే నేరాన్ని పునరావృతం చేయడం వల్ల నిందితుడికి మరణశిక్ష విధించవచ్చని వారు వెల్లడించారు. ఇదే సమయంలో మద్యంలో కల్తీకి జరిమానా మొత్తాన్ని రూ.30,000 నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కల్తీపై రూ.300 నుంచి రూ.2,000 వరకు నామమాత్రపు జరిమానా ఉండేది.
ఇవి కూడా చదవండి..
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
దేశం విడిచి వెళ్లండి: రష్యా దౌత్యవేత్తలకు అమెరికా ఆదేశం
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

