Gold Boom : రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
Gold Boom : రాబోయే 5 సంవత్సరాలలో బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలు దాటే అవకాశాలు ఉన్నాయని క్వాడ్రిగా ఫండ్ అంచనా వేసింది

న్యూఢిల్లీ : రానున్న రోజుల్లో బంగారం అమ్మకాల్లో బలమైన బూమ్ (Gold Boom) రానున్నదా?.. బంగారం ధరలు మరోసారి ఆశ్చర్యాన్ని కలిగించే స్థాయికి రాబోతున్నాయా?.. అవుననే అంటోంది స్పెయిన్‌కు చెందిన క్వాడ్రిగా ఫండ్ సంస్థ. రాబోయే 5 సంవత్సరాలలో బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలు దాటే అవకాశాలు ఉన్నాయని క్వాడ్రిగా ఫండ్ అంచనా వేసింది. ఈ సంస్థ అంచనా ప్రకారం రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో బంగారం ధర ప్రతి ఔన్స్‌కు 3,000 డాలర్ల నుంచి 5000 డాలర్ల వరకు ఉంటుంది. అనగా 10 గ్రాములకు రూ.78,690 నుంచి రూ.1,31,140 లుగా ఉండనున్నది.
రాబోయే ఐదేండ్లలో బంగారం ధర రికార్డు గరిష్ఠాలను తాకుతుందని 2016 లో ఈ సంస్థ సరిగ్గానే అంచనా వేసింది. దీని తర్వాత 2020 లో బంగారం రూ.56 వేలకు మించిపోయింది. గత కొన్ని వారాలుగా బంగారం ధర రూ.47,000 గా ఉన్నది. మరోవైపు, యూఎస్బీ గ్రూప్ వ్యూహకర్తలు ఈ సంవత్సరం బంగారం మరింత తగ్గుతుందని, అది రూ.44,600 కి చేరుకుంటుందని చెప్పారు. ఈ క్షీణత 2022 లో కూడా కొనసాగుతుందని అంటున్నారు. అయితే, క్వాడ్రిగా ఫండ్ మేనేజర్లు మాత్రం తమ అంచనాకు కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విశేషం.
బులియన్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.48,034 ఉన్నది. మరోవైపు, ఎంసీఎక్స్‌లో సోమవారం రూ.47,918 వద్ద ముగిసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం రూ.55 వేలకు చేరుకోనున్నది.
ఇవి కూడా చదవండి..
దేశం విడిచి వెళ్లండి: రష్యా దౌత్యవేత్తలకు అమెరికా ఆదేశం
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

