PV Sindhu Caste : పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
PV Sindhu Caste : సాధారణంగా ఒక దేశం ఆటగాడు ఒలింపిక్స్‌లో ఆడటానికి వెళ్లినప్పుడు.. ప్రజలు అతడు గెల్చిన పతకం గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ, గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారతీయ ఆటగాళ్ల కులాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్నది

టోక్యో ఒలింపిక్స్‌లో చాలా మంది భారత ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మీరాబాయి చాను రజతం గెల్చుకుని దేశ ప్రతిష్ఠను నిలుపగా.. పీవీ సింధు కాంస్యంతో మన దేశం పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. మహిళల, పురుషు హాకీ జట్లు సెమీ ఫైనల్స్ దశకు చేరుకున్నాయి. సాధారణంగా ఒక దేశం ఆటగాడు ఒలింపిక్స్‌లో ఆడటానికి వెళ్లినప్పుడు.. ప్రజలు అతడు గెల్చిన పతకం గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ, గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారతీయ ఆటగాళ్ల కులాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్నది.
గూగుల్ ట్రెండ్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పుసర్ల వెంకట సింధు (PV Sindhu Caste) పేరు తొలి స్థానంలో నిలిచింది. పీవీ సింధు కులం గురించి తెలుసుకునేందుకు ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసినట్లుగా కనిపిస్తున్నది. పీవీ సింధు కులమేంటో తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు తెలుస్తున్నది. ఆగస్టు 1 న పీవీ సింధు కులం అనే కీవర్డ్ గూగుల్ ట్రెండ్స్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన కీవర్డ్. ఇదే రోజున సింధు బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం గెలిచినంది. సింధు కులం జూలై 25-ఆగస్టు 1 మధ్య గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసినట్లుగా తేలింది.
పీవీ సింధు కులాన్ని తెలుసుకునే సెర్చ్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. జార్ఖండ్ రెండవ స్థానం, తెలంగాణ మూడవ, ఉత్తరప్రదేశ్ నాలుగవ, బిహార్ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఆగస్టు 1 న పీవీ సింధు కులం గురించి సెర్చింగ్ 700 శాతం పెరిగింది. అయితే సింధు కులం గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2016 ఆగస్టులో సింధు రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత కూడా ఆమె కులం ఏంటో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపారు. పీవీ సింధు కులం, పుసరాల కులం, పుసర్ల సున్నెం కులం వంటి కీ వర్డ్స్‌తో ఆమె కులం ఎంతో తెలుసుకునేందుకు ప్రజలు తాపత్రయపడుతున్నారు.
గోపిచంద్, సాక్షి మాలిక్ కులమేంటో..?
భారతీయ ఆటగాళ్ల కులాన్ని గూగుల్‌లో వెతకడం ఇదే మొదటిసారి కాదు. 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ప్లేయర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలుచుకున్నప్పుడు కూడా సాక్షి కులం గురించి గూగుల్‌లో చాలా సెర్చ్‌లు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో గూగుల్‌లో సాక్షి మాలిక్ కులం, మాలిక్ కులం వంటి కీ వర్డ్స్ టాప్ ట్రెండ్‌లో ఉన్నాయి.
అథ్లెట్ దీపికా కుమారి మహతో 2010 కామన్వెల్త్ గేమ్స్ ఆర్చరీ విభాగంలో బంగారు పతకం సాధించింది. అప్పటి నుంచి ప్రజలు ఇప్పటికీ దీపిక కులాన్ని తెలుసుకునేందుకు గూగుల్‌లో శోధించారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు దీపిక కులాన్ని తెలుసుకోవడానికి అదేపనిగాఉన్నట్లుగా తెలుస్తున్నది. దీపికా కుమారి కులం ఎంటో తెలుసుకోవడంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారు. అదేవిధంగా పుల్లెల గోపీచంద్, క్రికెటర్ సంజూ శాంసన్‌కు సంబంధించిన కులమేంటో తెలుసుకునేందుకు కూడా ప్రజలు చాలా ఆసక్తి చూపినట్లుగా గూగుల్ ట్రెండ్స్‌ను బట్టి తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
తొలిసారి ఇంట్లోకొచ్చిన కంప్యూటర్ టీఆర్ఎస్-80
దోమల జనాభా నియంత్రణ ద్వారా మలేరియాకు చెక్!
కరోనా వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌కు అడ్డుకట్ట
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
స్పెషల్ ఒలింపిక్స్‌లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

