No Kissing Zone : ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
No Kissing Zone : ముంబైలోని ఓ హౌజింగ్ సొసైటీ వాళ్లు ఏర్పాటుచేశారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాన్ని నిరోధించేందుకే ఈ ప్రత్యేక జోన్ (forbidden to kiss) ను ఏర్పాటుచేశామంటున్నారు వాళ్లు.

ముంబై : సిగరెట్ స్మోకింగ్ జోన్ అని, నో స్విమ్మింగ్ జోన్ అని.. రకరకాల జోన్స్ మనం విని ఉంటాం.. చూసి ఉంటాం. అయితే, ‘నో కిస్సింగ్ జోన్’ గురించి ఎప్పుడైనా విన్నారా..? విని ఉండరు. ఎందుకంటే ఇలాంటి జోన్స్ సాధారణంగా మనకు ఎక్కడా కనిపించవు. అచ్చం ఇలాంటి జోన్ ఒకటి ముంబైలోని ఓ హౌజింగ్ సొసైటీ వాళ్లు ఏర్పాటుచేశారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాన్ని నిరోధించేందుకే ఈ ప్రత్యేక జోన్ (No Kissing Zone) ను ఏర్పాటుచేశామంటున్నారు వాళ్లు.
ముంబైలోని బోరివలి ప్రాంతంలో ఉన్న సత్యం శివం సుందరం సొసైటీ ప్రధాన గేటు వద్ద లాక్డౌన్ సమయంలో నిత్యం ఎన్నో జంటలు వచ్చి బహిరంగంగా ముద్దులిచ్చుకుంటున్నారు. పలు జంటలకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. వీరి కోసం కాపలాకాయడం సొసైటీ వారికి తలనొప్పిగా తయారైంది. దాంతో ప్రధాన గేటు రోడ్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో ‘నో కిస్సింగ్ జోన్’ అని రాయించారు. దాంతో బహిరంగ ముద్దులు పెట్టుకోవడం నిలిచిపోయిందని సొసైటీ వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం సరైంది కాదు. హౌజింగ్ సొసైటీలోకి రావాలంటే కళ్లు మూసుకుని నడవాల్సి వస్తుంది. జంటలు ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ఇలా పెద్ద అక్షరాలతో బోర్డు పెట్టాల్సి వచ్చింది’ అని సొసైటీకి చెందిన వారంటున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇక్కడ బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాన్ని వీడియో చిత్రీకరించి స్థానిక కార్పొరేటర్, పోలీసులకు పంపినా ఫలితం లేకపోయింది. ‘ఇక్కడికి వచ్చే జంటలకు మేం వ్యతిరేకంగా కాదు, అయితే, వారు బహిరంగంగా ఇలాంటి కార్యక్రమాలను పూనుకోవడాన్నే వ్యతిరేకిస్తున్నాం’ అని స్థానిక న్యాయవాది వినయ్ అన్సుకర్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన చర్యలకు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులు ఈ బహిరంగ ముద్దుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి..
ఈ చట్టం కింద ఇంకా కేసులా?.. సుప్రీంకోర్టు షాక్
స్పెషల్ ఒలింపిక్స్‌లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం
ఇక రాయితో కొట్టారో.. కఠిన చర్యలు తప్పవు!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

