e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News Government of India Act : చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం

Government of India Act : చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం

బ్రిటిష్‌ పార్లమెంట్‌లో 163 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత ప్రభుత్వ చట్టం ఆమోదం పొందింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెక్‌ పెట్టేందుకు, 1858 ఆగస్ట్‌ 2 న ఈ చట్టాన్ని బ్రిటిష్‌ పార్లమెంట్‌ తీసుకురావడంతో భారతదేశాన్ని పూర్తిగా బ్రిటన్ తమ ఏలుబడిలోకి తీసుకున్నది. ఈ బిల్లును అప్పటి బ్రిటన్ ప్రధాని లార్డ్ పామర్‌స్టన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ చట్టానికి గవర్నమెంట్ ఆఫ్‌ ఇండియా యాక్ట్ 1858 (Government of India Act) అని పేరు పెట్టారు. ఈ చట్టం 1858 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

ఈ చట్టం తీసుకురావడంతో భారతదేశం పాలన బ్రిటీష్ రాజరికం చేతుల్లోకి వెళ్లింది. భారతదేశం నేరుగా ఇంగ్లండ్ పార్లమెంట్ ద్వారా నియంత్రించబడింది. రాణికి జవాబుదారీగా ఉండే భారతదేశంలో పరిపాలన కోసం ఒక కార్యదర్శిని నియమించారు.

- Advertisement -

బ్రిటిష్ పార్లమెంటులో భారత మంత్రి పదవిని రద్దు చేయడం ద్వారా 15 మంది సభ్యుల భారతీయ కౌన్సిల్ ఏర్పడింది. భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్ అయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రద్దయ్యాయి. అదే సమయంలో ఇండియన్‌ సెక్రటరీని నియమించారు.
అడ్మినిస్ట్రేటీవ్‌ సర్వీసుల్లో భారతీయులకు సమాన అవకాశాలు కల్పిస్తామని కూడా ప్రకటించారు. ఏ కారణంతోనూ వివక్ష చూపమని, భారతీయ రాజుల హక్కులు రక్షించబడతాయని పేర్కొన్నారు. దీనితో భారతదేశం బ్రిటిష్ కాలనీగా మారింది. లార్డ్ క్యానింగ్ భారతదేశపు మొదటి వైస్రాయ్‌గా నియమితులయ్యారు.

దీనికన్నా ముందు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చింది. మొఘల్ రాజుల బలహీనపడటం చూసి కంపెనీకి అత్యాశ పెరిగింది. ఈ సంస్థ భారతదేశంలోని వివిధ రాచరిక రాష్ట్రాలను విలీనం చేసుకున్నది. సంస్థ లక్ష్యం గరిష్ట లాభం సంపాదించడమే. అందుకు భారతీయులపై అనేక అఘాయిత్యాలకు పాల్పడింది. కార్మికులు, రైతుల పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది.

కంపెనీ విధానాల కారణంగా భారతీయులలో అసంతృప్తి పెరిగింది. పెద్ద స్థాయిలో పెల్లుబుకిన ఈ అసంతృప్తి 1857 లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. మీరట్ నుంచి ప్రారంభమైన ఈ తిరుగుబాటు తక్కువ సమయంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదిని కదిలించింది. ఇదే సమయంలో, బ్రిటన్‌లోని ఒక సంస్కరణవాద విభాగం కూడా భారతదేశం వంటి విశాలమైన దేశ పాలనను ఈస్ట్‌ ఇండియా వంటి వ్యాపార సంస్థకు అప్పగించరాదని డిమాండ్ తీసుకువచ్చింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీలో అవినీతి తారాస్థాయికి చేరుకోవడంతో.. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందలేకపోయింది. ఇవన్ని కారణాలతో భారతదేశం పాలనను నేరుగా తన ఆధీనంలోకి తీసుకోవాలని బ్రిటన్‌పై వచ్చిన ఒత్తిడి వల్లనే గవర్నమెంట్ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌, 1858 అమలులోకి తీసుకొచ్చింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

ఇవాళ జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి

2018: మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు దాటిన ఘనత సాధించిన మొదటి పబ్లిక్ లిస్టెడ్ యూఎస్‌ కంపెనీగా నిలిచిన ఆపిల్

2012: లండన్ ఒలింపిక్స్‌లో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించిన అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్

1999 : అసోంలో రెండు రైళ్లు ఢీకొన్ని ఘటనలో దాదాపు 300 మంది దుర్మరణం

1990 : గల్ఫ్‌ యుద్ధం ప్రారంభం

1943: రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ షిప్ పీటీ-109 ని ముంచివేసిన జపనీస్ నావికాదళం

1870: ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే లండన్‌లోని థేమ్స్ నది కింద ప్రారంభం

1790: అమెరికాలో తొలిసారిగా జనాభా గణన నిర్వహణ

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇక రాయితో కొట్టారో.. కఠిన చర్యలు తప్పవు!

కేపీఎల్‌ ఆడావో.. ఇండియా రానివ్వమన్నారు: హెర్షలీ గిబ్స్

అశ్వగంధ ఔషధంపై బ్రిటన్‌ పరిశోధన

 కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana