కారేపల్లి, మే 27 : వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ మరణించినా ప్రజా సేవతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్, బీఆర్ఎస్ మైనార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ కొనియాడారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్లో బుధవారం దివంగత మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. మదన్‌లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గ అభివృద్ధికి, పేదలకు సంక్షేమ పథకాలు దరిచేరడానికి మదన్‌లాల్ చేసిన సేవలు మరువలేనివన్నారు. గిరిజన, గిరిజనేతరులను సమన్వయ పరుస్తూ పని చేశారన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవటంలో మదన్‌లాల్ కృషి మరవలేనిదన్నారు.
మదన్‌లాల్ అకాల మృతి పార్టీ శ్రేణులకు తీరని లోటన్నారు. మదన్‌లాల్ ఆచరించిన క్రమశిక్షణ, నిబద్దతను పాటిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, నాయకులు తాతా వెంకటేశ్వర్లు, డొంకెన రవీందర్, సోమందుల నాగరాజు, జర్పల హచ్చు. రామచంద్రయ్య, గంగరబోయిన మురళి, పేర్ని వెంకటేశ్వర్లు, గంగరబోయిన సత్యం, అబ్దుల్ వహీద్, సోది కోటేశ్వరరావు, ఎండీ ఖలీలూల్లాఖాన్, జుంకీలాల్, చింతల కృష్ణ, దానబోయిన సమ్మయ్య, చింతల సంపత్, పోతు రాములు పాల్గొన్నారు.