హైదరాబాద్, ఆగస్టు 15: సాఫ్ట్వేస్ సొల్యూషన్స్ సంస్థ బ్లాక్బౌడ్..తెలంగాణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. నాన్-ఫ్రాపిట్ రంగంలో ఉన్న సంస్థలకు చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో ఈ సంస్థల సమన్వయంతో ఇక్కడ రెండో కార్యాలయాన్ని తెరువాలనుకుంటున్నట్టు కంపెనీ ఎండీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ గజ్రాజీయా తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 700 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే 18 నెలల్లో 1,700కి పెంచుకోనున్నట్టు ప్రకటించింది.
విస్తరణ బాటలో బీట్రాన్జ్
హైదరాబాద్, ఆగస్టు 15: రాష్ర్టానికి చెందిన ఈఆర్పీ, బిజినెస్ టెక్నాలజీ సేవల సంస్థ బీట్రాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్..అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం భారత్‌తోపాటు రియాద్, యూఏఈలో సేవలు అందిస్తుండగా, సమీక్ష భవిష్యత్తులో యూరప్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని కంపెనీ ఎండీ షకీర్ పాషా తెలిపారు. ప్రస్తుతం సంస్థలో వంద మంది ఉద్యోగులు ఉండగా, వచ్చే ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను రెండింతలు పెంచుకోనున్నట్టు ప్రకటించారు.