Jagadish Reddy | అన్ని ఎకరాలు ఎక్కడున్నయో చూపిస్తే అమ్ముకోనైనా అమ్ముకుంటా : జగదీష్ రెడ్డి
Jagadish Reddy | ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా నాకు కేవలం 47 ఎకరాలుందని చెప్పిండు.. నిన్న మాట్లాడిన ఒక్కరు కూడా ఆరోపణలు చేయలేదు. కానీ ఇవాళ ఆ పేపర్ లో ఉందట అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Jagadish Reddy | మాకు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇంకొక ఆయన మోపయ్యిండు.. ‘ఏబీఎస్ బాధాకృష్ణ’ ఎందుకంటే నిన్న మాట్లాడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు కూడా చెప్పలేదు.. నా దగ్గర ఇన్ని ఎకరాలు భూమి ఉందని నాకు కూడా తెలియదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా నాకు కేవలం 47 ఎకరాలుందని చెప్పిండు.. నిన్న మాట్లాడిన ఒక్కరు కూడా ఆరోపణలు చేయలేదు. కానీ ఇవాళ అందులో ఉందట.. నేను ఆ పేపర్ చదువలేదు కానీ.. నాకు ఆ పేపర్ చదివే అలవాటు కూడా లేదన్నారు.
మిత్రులు చెబుతున్నరు. నీకు తుంగతుర్తిలో 110 ఎకరాలుంది.. మునుగోడులో 80 ఎకరాలుంది.. ఇంకెక్కడెక్కడో ఉన్నయని ఒక పేపర్లో వచ్చిందని చెప్పారు. ఎందుకు ఒకటే నీతులు వల్లిస్తవ్ బాధాకృష్ణ. ఆదివారాలు, ఆదివారాలు ఒకటే రాస్తవ్.. నువ్వు రాస్తవో.. ఇంకొకరితో రాయిస్తవో నాకు తెల్వదు కానీ.. ఏం నీతి మాలిన పని అది అని ప్రశ్నించారు. ఎవరన్నా ఆరోపణ చేస్తే వేరు.. అవును నేను ఇంత తిరిగినా.. ఇన్ని సంవత్సరాల సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నా.. ఆ ఎండిపోయిన పొలాలను ప్రజలకు పోయి చూపిస్తున్నా.. ఒకనాడు నా వార్త నీ పేపర్లో కొంచెం కూడా రాదన్నారు.
ఎందుకు ఎవడన్నా అనగానే అంత ప్రేమ పుట్టుకొస్తదేంది.. ఫ్రంట్ పేజీలో పెట్టి రాసినవట.. ఆ 110 ఎకరాలు ఎక్కడున్నయో.. 80 ఎకరాలు ఎక్కడున్నయో చూపించు.. కనీసం అమ్ముకోనైనా అమ్ముకుంటా వాటిని.. నీకు కూడా అడ్వర్టైజ్మెంట్ బాకీ ఉంది కొంత అది కూడా ఇస్తా.. చెప్పు హద్దులు ఎక్కడున్నయో.. ఎందుకు ఇలాంటి చెత్త పనులు, నీతి మాలిన పనులు.. కాంగ్రెస్ నాయకుల కంటే నువ్వెక్కువ బాధపడతావ్ ఎందుకు అని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్లో రాస్తున్నాడని ఎద్దేవా చేశారు.
ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త
నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో
కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన… https://t.co/ioTKO0KRgj pic.twitter.com/ksAEAPdDFc
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026
Read Also :
Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

