IND vs JAP : ఆసియా క్రీడల నడుమ దౌత్య బంధానికి ప్రతీకగా జరిగిన చరిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయంతో మురిసింది. భారత్, జపాన్ 75 ఏళ్ల ఆత్మీయతకు సాక్షిగా నిలిచిన ఈ ఏకైక మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ సేన ఏదో అలా గెలుపొందింది. ఇరవై ఓవర్ల ఆట అనుకున్నప్పటికీ.. వర్షం కారణంగా ఐదు ఓవర్లే సాధ్యపడగా రెండు పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది మెన్ ఇన్ బ్లూ.
పద్దెనిమిదో ఆసియా క్రీడలు కొనసాగుతున్న వేళ.. భారత్, జపాన్ ఏకైక టీ20 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరుదేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. కంటోలోని సనోలో ఉన్న సనో ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో మంగళవారం పూర్తి ఓవర్ల ఆటకు వర్షం అడ్డుపడింది. తడి ఔట్‌ఫీల్డ్ కారణంగా అంపైర్లు, రిఫరీ 5 ఓవర్లు ఆడించారంతే. ఇంకే ముంది జపాన్ బౌలర్లను మనోళ్లు బెంబేలెత్తిస్తారనుకుంటే.. అఫ్గనిస్థాన్‌పై ఆఖరి టీ20లో మెరుపు సెంచరీ బాదిన ఓపెనర్ అభిషేక్ శర్మ(0) డకౌటయ్యాడు.
📸📸 Picture-perfect frames with the Captains 🏆
The stage is set for a historic clash between #TeamIndia and Japan 🤝#TeamIndiaInJapan | @CricketJapan pic.twitter.com/5mGTm42RZj
— BCCI (@BCCI) September 21, 2026
మరో ఓపెనర్ సంజూ శాంసన్(9)ను ఇబ్రహీం తకహశీ వెనక్కి పంపాడు. అనంతరం.. ఇషాన్ కిషన్(3) సైతం తేలిపోయినా.. అయ్యర్(16) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా ప్రత్యర్థికి 32 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. ఆపై వాషింగ్టన్ సుందర్(2-13) విజృంభణతో జపాన్ బ్యాటర్లు క్రీజులో నిలవలేదు. ఓపెనర్ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఫలితంగా ఆతిథ్య జట్టు ఐదు ఓవర్లలో4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే పరిమితమైంది.
అయితే.. ఈ మ్యాచ్‌లో జపాన్‌లో క్రికెట్ విస్తరణకు కీలక అడుగు పడినట్టైంది. ఇరుదేశాల ద్వైపాక్షిక బంధానికి గర్తుగా నిర్వహించిన ఈ మ్యాచ్‌పై జపనీయులు ఆసక్తి కనబరిచారు. దాంతో.. రాబోయే రోజుల్లో జపాన్ క్రికెట్‌కు మహర్ధశ వచ్చే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.
Innings Break!#TeamIndia set a target of 33. Over to the bowlers now to defend this!
Updates ▶️ https://t.co/0YhYTwc8HS#TeamIndiaInJapan pic.twitter.com/9RBHm0b1dp
— BCCI (@BCCI) September 22, 2026