Admissions | జేఎన్ఏఎఫ్ఏయూలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్స్ ప్రారంభం
Admissions |ఫైన్ ఆర్ట్స్‌లో ఆసక్తి ఉండి అందులో డిగ్రీ కోర్సులు చేయాలనుకునేవారికి అవకాశం లభించింది. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కొన్ని కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..
Admissions |హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU) 2026 సంవత్సరానికి రెండేండ్ల ఫుల్ టైమ్ సెల్ఫ్ ఫైనాన్స్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
సబ్జెక్టుల వారీగా సీట్లు
MFA (అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్)- 20
MFA (ఫొటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్)- 15
MFA (పెయింటింగ్)- 15
MFA (స్కల్ప్చర్)- 6

Fine Arts
అర్హతలు
సంబంధిత విభాగంలో (అప్లైడ్ ఆర్ట్, ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చర్) నాలుగేండ్ల BFA లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. ఫొటోగ్రఫీలో మూడేండ్ల BFA చదివి, మూడేండ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్మిషన్స్ పొందే విధానం
రాత పరీక్ష, ప్రాక్టికల్/పోర్ట్‌ఫోలియో, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు
అర్హత గల వారు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్, దరఖాస్తు ఫీజు డీడీలను యూనివర్సిటీ ఆఫీసులో ఇవ్వాలి. స్కల్ప్చర్ కోర్సుకు దరఖాస్తు చేసేవారు రెండు పాస్ ఫొటోలను (5”x7” సైజ్ అటెస్టెడ్) దరఖాస్తుకు జతచేయాలి. వీటిని మాసబ్ ట్యాంక్‌లోని JNAFAU క్యాంపస్‌లో సమర్పించాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇదే అడ్రస్‌లో నిర్వహిస్తారు.
చివరితేదీ
దరఖాస్తులను అక్టోబర్ 12వ తేదీలోగా ఆఫీసులో సమర్పించాలి. రూ. 2000 ఫైన్‌తో అక్టోబర్ 17 వరకు సమర్పించవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

