Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. చిరంజీవి ‘అంజి’ తర్వాత మళ్లీ ఈ తరహా కథలో నటిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా ఆలస్యానికి గల కారణాన్ని నటుడు రాజీవ్ కనకాల వెల్లడించారు.
‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఆషికా రంగనాథన్, సురభి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా సినిమా ఆలస్యంపై మాట్లాడిన రాజీవ్ కనకాల.. చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అవి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో చిత్రబృందం మరింత శ్రద్ధగా పనిచేస్తోందని తెలిపారు. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు ఆశించే స్థాయిలో నాణ్యత ఉండాలని, అందుకే వీఎఫ్ఎక్స్ పనుల్లో ఎలాంటి తొందరపాటు చేయడం లేదని ఆయన వివరించారు. సినిమా నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొంత సమస్య ఎదురైందని పేర్కొన్నారు.
ఆ పనులు మరింత మెరుగ్గా రావాలనే ఉద్దేశంతోనే విడుదల ఆలస్యమవుతోందని రాజీవ్ కనకాల మాటలను బట్టి స్పష్టమవుతోంది. విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కచ్చితమైన విడుదల తేదీని చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాకే విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం చిరంజీవిని మరోసారి ఫాంటసీ ప్రపంచంలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

