Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Madras High Court | ప్రభుత్వాలపై ప్రజలుచేసే విమర్శల గురించి మద్రాస్ హైకోర్టు (Madras HighCourt) కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని పేర్కొన్నది. అదే సమయంలో ప్రజలకు ఉన్న అలాంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉంటుందని వ్యాఖ్యానించింది.
Madras High Court : ప్రభుత్వాలపై ప్రజలుచేసే విమర్శల గురించి మద్రాస్ హైకోర్టు (Madras HighCourt) కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని పేర్కొన్నది. అదే సమయంలో ప్రజలకు ఉన్న అలాంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉంటుందని వ్యాఖ్యానించింది. తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) ను కించపరిచారనే ఆరోపణలతో డీఎంకే కౌన్సిలర్ సుధపై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ కోసం సుధ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ ఎన్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించడం, విమర్శించడం, వ్యతిరేకతను తెలియజేయడం పౌరుల ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రశంసించడంతోపాటు విమర్శించే స్వేచ్ఛ కూడా ప్రజలకు ఉంటుందని స్పష్టంచేసింది. పాలన మారవచ్చు, ముఖ్యమంత్రులు మారవచ్చు, కానీ చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం ఎప్పటికీ మారదని చెప్పింది.
ఓ రాజకీయ నాయకుడి ప్రసంగం పాలకులను అవమానించేలా ఉన్నంత మాత్రాన అది నేరం కాదని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో సహా ప్రజా జీవితంలో ఉన్న నేతలందరికీ ఉంటుందని తెలిపింది. పాలకులు విమర్శలకు అతీతులు కారని కోర్టు పేర్కొన్నది. చట్టాన్ని అమలుచేసే అధికారులుగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

