కారేపల్లి, మే 27 : దూపదీప నైవేద్యం పథకం(డీడీఎన్) పరిధిలోని ఆలయాల్లో బుధవారం అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ప్రత్యేక సోషల్ ఆడిట్ బృందం కారేపల్లి మండలంలోని డీడీఎన్ దేవాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దేవాలయల నిర్వహణ, నిర్వహిస్తున్న పూజలు, భక్తులకు అందుతున్న సేవలు ఆడిట్ బృందం పరిశీలించింది. ఆలయాల్లో డీడీఎన్ లో వేతనాలు పొందుతున్న పూజారుల హాజరు, విధుల నిర్వాహణపై ఆరా తీశారు. ఆలయ ఆస్తులు, ఆదాయ వనరులు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకత జవాబుదారితనంతో నిధులు సక్రమంగా వినియోగం అవుతాయన్నారు.