Mirabai Chanu : త్వరలో మీరాబాయి చాను బయోపిక్
Mirabai Chanu : టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి భారతదేశం జెండాను ఎగురవేసిన మీరాబాయి చాను జీవితచరిత్రపై సినిమా రానున్నది. చాను బయోపిక్ తీసేందుకు ఇంఫాల్‌కు చెందిన స్యూటి ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది

న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి భారతదేశం జెండాను ఎగురవేసిన మీరాబాయి చాను (Mirabai Chanu) జీవితచరిత్రపై సినిమా రానున్నది. చాను బయోపిక్ తీసేందుకు ఇంఫాల్‌కు చెందిన స్యూటి ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం మణిపూర్‌లోని నాంగ్పాక్ కాచింగ్ గ్రామంలో ఉన్న మీరాబాయి చాను నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో మీరాబాయి, స్యూటి ఫిల్మ్ ప్రొడక్షన్స్.. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ గురించి సమాచారం ఇచ్చింది. బయోపిక్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కంపెనీ ప్రెసిడెంట్ మనబ్ ఎంఎం.. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకుంటూ.. ఇంగ్లిష్‌తోపాటు వివిధ భారతీయ భాషల్లో డబ్ చేయనున్నట్లు తెలిపారు.
టోక్యో ఒలింపిక్ క్రీడల తొలిరోజునే 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొన్న మీరాబాయి చాను రజత పకం సాధించింది. ఈ పోటీలో ఇప్పటివరకు భారతదేశానికి పతకం సాధించిన ఏకైక క్రీడాకారిణిగా మీరాబాయి చాను నిలిచారు. ఒలింపిక్ చరిత్రలో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది రెండో ఒలింపిక్ పతకం మాత్రమే.
ఇవి కూడా చదవండి..
స్పెషల్ ఒలింపిక్స్‌లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం
ఇక రాయితో కొట్టారో.. కఠిన చర్యలు తప్పవు!
కేపీఎల్ ఆడావో.. ఇండియా రానివ్వమన్నారు: హెర్షలీ గిబ్స్
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

