e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News Sonu Sood : స్పెషల్‌ ఒలింపిక్స్‌లో ఇండియాకు సోనూ సూద్‌ నాయకత్వం

Sonu Sood : స్పెషల్‌ ఒలింపిక్స్‌లో ఇండియాకు సోనూ సూద్‌ నాయకత్వం

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరుగనున్న స్పెషల్‌ ఒలింపిక్స్‌లో భారతదేశానికి నటుడు సోనూ సూద్‌ (Sonu Sood) నాయకత్వం వహించనున్నారు. వచ్చే జనవరి 22 నుంచి రష్యాలోని కజాన్‌లో స్పెషల్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ సూద్‌ లీడ్‌ చేయనున్నారు. గత నెల 30 న పుట్టినరోజు జరుపుకున్న సోనూ సూద్‌.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో దినసరి కూలీలతోపాటు పలువురు విద్యార్థులకు రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అనంతరం కూడా ఆపన్నులకు అండగా నిలుస్తూ ఎందరికో వైద్యసేవలు అందిస్తున్నారు.

సోనూ సూద్ ఇటీవల భారతదేశ ప్రత్యేక అథ్లెట్లు, అధికారులతో వర్చువల్ సంభాషణలో లీడ్‌ చేసే విషయాన్ని ప్రకటించారు. ‘స్పెషల్ ఒలింపిక్స్‌కు ఇండియా అథ్లెట్లు చేస్తున్న ప్రయాణంలో నేనూ భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉన్నది. ఈ కుటుంబంలో చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్లాట్‌ఫామ్‌ని మరింత పెద్దదిగా చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాను’ అని సోనూ సూద్‌ చెప్పారు. అథ్లెట్లు దీనికి ‘స్పెషల్ ఒలింపిక్స్ ఆసియా పసిఫిక్ రీజియన్ ఇనిషియేటివ్‌’ అని కూడా పేరు పెట్టారు. ‘వాక్ ఫర్ ఇన్‌క్లూజన్’ కు పరిచయం చేశారు. ప్రత్యేక ఒలింపిక్స్‌కు భారత బ్రాండ్ అంబాసిడర్‌గా సోను సూద్‌ జనవరిలో రష్యాలోని కజాన్‌లో భారతదేశానికి చెందిన అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహిస్తారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం

ఇక రాయితో కొట్టారో.. కఠిన చర్యలు తప్పవు!

కేపీఎల్‌ ఆడావో.. ఇండియా రానివ్వమన్నారు: హెర్షలీ గిబ్స్

అశ్వగంధ ఔషధంపై బ్రిటన్‌ పరిశోధన

 కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana