e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News Taliban‘s attack : రక్షణ మంత్రి టార్గెట్‌గా కార్‌ బాంబు దాడి

Taliban‘s attack : రక్షణ మంత్రి టార్గెట్‌గా కార్‌ బాంబు దాడి

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా మహమ్మదీని తాలిబాన్ ఉగ్రవాదులు (Taliban‘s attack) టార్గెట్ చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఇంటిపై కారు బాంబు దాడి జరిపారు. అనంతరం కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లు కూడా వినిపించాయి. పేలుడు జరిగిన సమయంలో బిస్మిల్లా మహమ్మదీ ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రక్షణ మంత్రి, అతడి కుటుంబం సురక్షితంగా ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. కాబూల్ జిల్లా 10 లోని షిర్పూర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పేలుళ్ల తర్వాత కాబూల్‌, జలాలాబాద్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. మరోవైపు, తాలిబాన్ హింసను ఆపడానికి జోక్యం చేసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ హనీఫ్ అత్మార్ భారతదేశానికి విజ్ఞప్తి చేశారు.

కారు బాంబు దాడి జరిగిన ప్రాంతం హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కొంతమంది పార్లమెంటేరియన్లు, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు నివసిస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో మొదటి పేలుడు తర్వాత సైరన్ వినిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అనంతరం రెండు, మూడవ పేలుళ్లు జరిగాయి. దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గంటలోపు అంబులెన్స్ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. పేలుడు సమయంలో రక్షణ మంత్రి బిస్మిల్లా మహమ్మదీ ఇంట్లో లేడు. అతడి కుటుంబ సభ్యులెవరూ గాయపడలేదు. అయితే, 10 మంది ఇతరులు గాయపడినట్లు సమాచారం. అయితే వారు పేలుడులో గాయపడ్డారా లేక కాల్చుకున్నారా అనే విషయంపై స్పష్టత లేదు.

- Advertisement -

పేలుళ్లు జరిగిన వెంటనే కాబూల్‌, జలాలాబాద్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. ఆఫ్ఘన్ భద్రతా దళాలకు మద్దతుగా నినాదించారు.

భారత్‌ జోక్యం చేసుకోవాలి

ఈ సంఘటన అనంతరం భారతదేశం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ హనీఫ్ ఆత్మర్ ఫోన్‌లో మాట్లాడారు. తాలిబాన్‌ హింసను నిలువరించేందుకు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అఫ్ఘనిస్తాన్‌పై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్ ఇండియా అధ్యక్షుడిని ఆత్మర్ కోరారు. తాలిబాన్‌ హింస, దురాగతాల వల్ల సంభవిస్తున్న విషాదాన్ని నివారించడంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

 ఆసియా తొలి న్యూక్లియార్‌ రియాక్టర్‌ ప్రారంభం

ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?

రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర

వుహాన్‌లో మళ్లీ కరోనా కలకలం

పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్‌లో జోరుగా సెర్చింగ్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana