సోమవారం 08 మార్చి 2021
Business - Feb 23, 2021 , 00:04:15

ఎల్ఐసీ ‘బీమా జ్యోతి‌’ ప్లాన్‌.. ఇవీ డిటైల్స్‌!!

ఎల్ఐసీ ‘బీమా జ్యోతి‌’ ప్లాన్‌.. ఇవీ డిటైల్స్‌!!

న్యూఢిల్లీ: ‌జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) త‌న ఖాతాదారుల కోసం ‘బీమా జ్యోతి‌’ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇది నాన్‌లింక్డ్‌, నాన్ పార్టిసిపేటింగ్ వ్య‌క్తిగ‌త సేవింగ్స్ ప్లాన్. ఇది ఖాతాదారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతో వారి సొమ్మును ఆదా చేస్తుంది. మెచ్యూరిటీ స‌మ‌యానికి భారీ మొత్తంలో సొమ్ము పొందే హామీని ఇస్తోంది. ఒక‌వేళ పాల‌సీ హోల్డ‌ర్ అసాధార‌ణ మ‌ర‌ణానికి గురైతే సంబంధిత కుటుంబానికి ఆర్థిక మ‌ద్ద‌తుగా ఉంటుంది.

ఎల్ఐసీ ఏజంట్ల వ‌ద్ద ఆఫ్ లైన్‌లో గానీ, ఆన్‌లైన్‌లో నేరుగా సంస్థ వెబ్ సైట్ www.licindia.inలో గానీ ఈ ప్లాన్‌లో చేరవ‌చ్చు. ప్ర‌తియేటా పాల‌సీ బేసిక్ మొత్తంలో ప్ర‌తి వెయ్యి రూపాయ‌ల‌కు రూ.50 జ‌మ అవుతాయి. అకాల మ‌రణానికి గురైన వారి కుటుంబాల‌కు పాల‌సీ ష‌ర‌తుల‌కు అనుగుణంగా భారీ మొత్తంలో హామీతోపాటు అద‌న‌పు సొమ్ము అందుతుంది. ఇన్‌స్టాల్‌మెంట్ల‌లోనూ డెత్ లేదా మెచ్యూరిటీ బెనిఫిట్లు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. 

క‌నిష్టంగా రూ. ల‌క్ష నుంచి పాల‌సీ కొనుగోలు చేయాలి. గ‌రిష్ట మొత్తానికి ప‌రిమితుల్లేవు. 15 ఏండ్ల నుంచి 20 ఏండ్ల వ‌ర‌కు పాల‌సీ తీసుకోవ‌చ్చు. 90 రోజుల ప‌సికందు నుంచి 60 ఏండ్ల‌లోపు వారు ఈ పాల‌సీలో చేరొచ్చు. ఏడాదికోసారి, ఆరు నెల‌ల‌కోసారి. మూడు నెల‌ల‌కోసారి, నెల‌కోసారి వాయిదాల్లో ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు. వేత‌న జీవుల శాల‌రీ నుంచి నేరుగా డిడ‌క్ష‌న్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు లోన్ ఫెసిలిటీ కూడా ఈ ప్లాన్‌తో పొందొచ్చు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo