Jude Anthany Joseph | మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ (Vismaya Mohanlal), త్వరలో నటిగా వెండితెరపై అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. ‘తుడక్కమ్’ (Thudakkam) అనే సినిమాతో విస్మయ పరిచయం కాబోతుండగా.. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో కొచ్చిలో గురువారం ఘనంగా ప్రారంభమైంది. కొచ్చిలోని క్రౌన్ ప్లాజాలో జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా మోహన్‌లాల్‌తో పాటు, ఆయన సతీమణి సుచిత్ర, కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ సహా చిత్ర బృందం పాల్గొంది. ఈ చిత్రానికి ‘2018’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ (Jude Anthany Joseph) దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్‌లాల్‌కు అత్యంత ఆప్తులైన ఆంటోనీ పెరుంబావూర్ నేతృత్వంలోని ఆశీర్వాద్ సినిమాస్ (Aashirvad Cinemas) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఆంటోనీ పెరుంబావూర్ కుమారుడు ఆశీష్ ఆంటోనీ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు.
ఈ సినిమా పూజా కార్యక్రమం అనంతరం మోహన్‌లాల్ మాట్లాడుతూ తన జీవితంలో ప్రతిదీ ఒక ‘విస్మయం’ (ఆశ్చర్యం)గా భావించే తాను.. తన కుమార్తెను కూడా అదే పేరుతో పిలుచుకుంటానని తెలిపారు. తన పిల్లలు ఇద్దరూ (ప్రణవ్, విస్మయ) సినీ పరిశ్రమలోకి వస్తారని తాను ఎప్పుడూ ఊహించలేదని, ఇది ప్రేక్షకులే ఇచ్చిన ప్రేమ, ఆశీర్వాదం అని లల్లెట్టన్ పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘తుడక్కమ్’ అంటే ‘ప్రారంభం’ అని. ఇది ఒక సాధారణ కుటుంబ చిత్రం అని జూడ్ తెలిపాడు.
എൻ്റെ പ്രിയപ്പെട്ട മായക്കുട്ടിയുടെ തുടക്കം.#Thudakkam @Mohanlal #JudeAnthanyJoseph #VismayaMohanlal @aashirvadcine #AashishJoeAntony pic.twitter.com/2Zme4Q6YX6
— Antony Perumbavoor (@antonypbvr) October 30, 2025