INDW VS AUSW : వన్డే ప్రపంచ కప్‌లో నిలకడగా రాణిస్తున్న శ్రీ చరణి(2-32).. సెమీఫైనల్లోనూ తిప్పేస్తోంది. వరుస ఓవర్లలో రెండు బిగ్ వికెట్లు తీసి భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఆస్ట్రేలియాను కట్టడి చేసింది. డేంజరస్ బేత్ మూనీ(24)ని ఔట్ చేసిన తను.. ఆ తర్వాత అనాబెల్ సథర్లాండ్(3)ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపింది. దాంతో.. రాకెట్లా దూసుకెళ్తున్న ఆసీస్ స్కోర్ బోర్డు నెమ్మదించింది. క్రీజులో పాతుకుపోయిన అలీసా పెర్రీ(77)ని రాధా యాదవ్ బౌల్డ్ చేయడంతో కంగారూ టీమ్ ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం అషే గార్డ్నర్(4), తహ్లియా మెక్‌గ్రాత్(6)లు జట్టు స్కోర్ 300 దాటేంచే పనిలో ఉన్నారు. 40 ఓవర్లకు స్కోర్.. 253-5.
సెమీఫైనల్లో భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఆస్ట్రేలియాను భారత బౌలర్లు గొప్పగా కట్టడి చేస్తున్నారు. ఆరో ఓవర్లోనే అలీసా హేలీ(5)ని క్రాంతిగౌడ్ ఔట్ చేసి షాకిచ్చినా.. శతకంతో రెచ్చిపోయిన ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(119), అలీసా పెర్రీ (77)లు విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలింగ్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ద్వయం రెండో వికెట్‌కు 155 రన్స్ జోడించి కంగారు పెట్టించింది. సెంచరీ తర్వాత సిక్సర్లతో విరుచుకుపడిన లిచ్‌ఫీల్డ్‌ను బౌల్డ్ చేసిన అమన్‌జోత్ బిగ్ వికెట్ అందించింది. ఆ తర్వాత శ్రీచరణి విజృంభించి.. రెండు కీలక వికెట్లు తీసి ఆసీస్ స్కోర్ వేగానికి కళ్లెం వేసింది.
Radha Yadav joins the wicket-taking party 🥳
Another one bites the dust as the well-set Ellyse Perry departs ✌️
Updates ▶ https://t.co/ou9H5gNDPT#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS pic.twitter.com/TtS3hMXIcE
— BCCI Women (@BCCIWomen) October 30, 2025