Laayi Le Third Single Out | నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend). ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి థర్డ్ సింగిల్ లాయీ లే’ (Laayi Le) పాటను మేకర్స్ విడుదల చేశారు. రష్మిక, ధీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) మధ్య ప్రేమకథను, సున్నితమైన భావోద్వేగాలను తెలియజేస్తూ ఈ పాట సాగుతుంది.
ఈ మెలోడీకి హేశమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) అద్భుతమైన సంగీతం అందించగా. ప్రముఖ గాయకుడు కపిల్ కపిలన్ (Kapil Kapilan) ఆలపించారు. తెలుగులో ఈ పాటకు రాకేందు మౌళి (Rakendu Mouli) సాహిత్యాన్ని అందించారు.