తాండూర్ : విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య ( DEO Yadaiah) సూచించారు. మండలంలోని రేచిని పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మాలిక వసతుల గురించి విద్య, వివిధ అంశాలపై సూచనలు చేశారు.
పాఠశాలలోని విద్యార్థులు రజిత, హర్షిత గత సంవత్సరం సీఎం కప్ క్రీడా పోటీలలో స్టేట్ లెవెల్ పోటీలకు ఎంపిక కాగా వారిని ప్రోత్సహిస్తూ మిగతా విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని ఆవార్డులు సాధించాలని కోరుతూ క్రీడాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎస్ మల్లేశం, ఇన్చార్జి హెచ్ఎం బగ్గని రవికుమార్, సీనియర్ ఉపాధ్యాయులు బట్టారి వెంకటేశ్వర్లు, రత్నయ్య, సతీష్ కుమార్, రవిబాబు, కృష్ణ గౌడ్, శ్రీలత, సుకుమాంజలి, సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.