Rahul Ravindran | టాలీవుడ్లో యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అతికొద్ది సెలబ్రిటీల్లో ఒకరు రాహుల్ రవీంద్రన్. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్ . దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న ఈ మూవీ నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ఈ సందర్భంగా చేసిన చిట్‌చాట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు రాహుల్ రవీంద్రన్.
తన కాలేజ్ రోజుల్లో ఎదుర్కొన్న ఒక అనుభవం ఆధారంగా కథ రాశానన్నాడు రాహుల్ రవీంద్రన్. ఆ సమయంలో నాకు వినిపించిన ఓ పాట కూడా ఈ కథ రాయడానికి స్పూర్తిని కలిగించింది. ఖాళీగా ఉన్న టైంలో కొన్ని స్క్రిప్టులు రెడీ చేశా. ఆహా టీం ఓ సినిమా కోసం నన్ను సంప్రదిస్తే.. ఈ కథ పంపాను. నేను గీతాఆర్ట్స్ బ్యానర్లో రష్మికతో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అల్లు అరవింద్ ది గర్ల్ ఫ్రెండ్ స్టోరీ విన్నప్పుడు ఈ కథను ఓటీటీ కంటే థియేటర్లలో చూపించడం బెటరన్నారని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు.
రష్మికకు స్క్రిప్ట్ పంపించా. ఆమె నాకు రెండు రోజుల తర్వాత ఫోన్ చేసింది. పూర్తిగా చదివిన రష్మిక మందన్నా వెంటనే సినిమా చేసేందుకు ఒకే చెప్పింది. ఈ కథను అందరికీ చెప్పాల్సిన అవసరముందని అభిప్రాయపడిన రష్మిక.. స్క్రిప్ట్ బాగా కనెక్ట్ అయినట్టు చెప్పింది. నేనెప్పుడైనా ఓ కథ రాస్తే నా స్నేహితులైన సమంత, వెన్నెల కిశోర్, అడివిశేష్, డైరెక్టర్ సుజిత్‌కు చెప్పి వారి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. గర్ల్ ఫ్రెండ్ స్టోరీ కూడా వారికి పంపించాను. అయితే ఈ మూవీలో సమంతను తీసుకుంటున్నానని పుకార్లు కూడా వచ్చాయి. కానీ సమంత స్క్రిప్ట్ చదివిన తర్వాత మరో హీరోయిన్ను ఎంపిక చేసుకుంటే మంచిదని అభిప్రాయపడింది.. అలా రష్మికను ఫైనల్ చేశామన్నాడు రాహుల్ రవీంద్రన్.
Bhoomi Shetty | ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Mahesh Babu | బాహుబలి రీరిలీజ్‌తో రాజమౌళి బిజీ బిజీ.. ఈ గ్యాప్‌ని మహేష్ భలే వాడేస్తున్నాడుగా..!