Mahesh Babu | సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇటీవల కెన్యా, టాంజానియా దేశాల్లో షూటింగ్ జరిపి టీమ్ హైదరాబాద్‌కి తిరిగొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి తాత్కాలిక విరామం లభించింది.దీనికి కారణం రాజమౌళి రూపొందించిన బాహుబలి: ది ఎపిక్ రీ-రిలీజ్ పనులు. రెండు బాహుబలి సినిమాలను కలిపి ఒకే ఎడిషన్‌గా రూపొందించిన ఈ ఎపిక్‌ను అక్టోబర్ 31న భారీ స్థాయిలో మళ్లీ విడుదల చేయబోతున్నారు. గత కొన్ని వారాలుగా రాజమౌళి ఈ పనుల్లో బిజీగా ఉన్నందున మహేష్ బాబు షూటింగ్‌కు చిన్న బ్రేక్ లభించింది.
షూటింగ్ నుంచి గ్యాప్ దొరికిన వెంటనే మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కు వెళ్లిపోయారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రం మధ్యలో ఉన్న రిసార్ట్‌లో తీసిన ఆ ఫోటోలో మహేష్ ఫేస్ కనిపించకపోయినా, ఆయన రిలాక్స్ మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. “అద్భుతమైన ప్లేస్‌లో అద్భుతమైన అనుభవం. థాంక్యూ ఫర్ ద వండర్ఫుల్ స్టే!” అంటూ ఆయన పోస్ట్‌లో రాశారు. ఈ ఫోటో చూసిన అభిమానులు “సముద్రంలో సాహసాలు చేస్తున్నావేంటి బాబు జాగ్రత్త!” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక వచ్చే నెలలో మళ్లీ రాజమౌళి–మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ కాశీ సెట్ వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ ఎల్లలు దాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు. జక్కన్న మూవీకి తన పూర్తి టైం మహేష్ కేటాయించగా, ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరికే సరికి ఎంచక్కా ఫ్యామిలీతో టూర్ వేసాడు మహేష్. ఏది ఏమైన అటు ప్రొఫెషనల్, ఇటు పర్సనల్ లైఫ్‌ని మహేష్ బాబు భలే బ్యాలెన్స్ చేస్తున్నాడుగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.