Abhishek Bachchan | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ మరోసారి తన సమాధానంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఆయన నటించిన ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రంలో చేసిన అద్భుత నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఈ విజయం వెనుక నిజమైన ప్రతిభ లేదని, అవార్డులు “కొనుక్కుంటారని” ఓ సినీ విమర్శకుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ క్రిటిక్ అభిషేక్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “ఎవరూ చూడని సినిమాకు అవార్డు ఎలా వస్తుంది?” అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ వర్గాలు కూడా చర్చించసాగారు.
ఈ విమర్శలపై అభిషేక్ బచ్చన్ తన స్టైల్లోనే బదులిచ్చారు. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ .. ఇప్పటివరకు నేను ఒక్క అవార్డు కూడా కొనలేదు. నా కోసం ఎవరూ పీఆర్ చేయలేదు. నేను కష్టపడి పనిచేయడం, చెమట చిందించడం, కన్నీళ్లే నాకు తెలుసు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ… మీ నోరు మూయించడానికీ సరైన మార్గం నాకు తెలుసు. ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తాను. మీరు అనుకున్నది తప్పని నిరూపిస్తా. ఇదంతా గౌరవపూర్వకంగానే చెబుతున్నాను అని అభిషేక్ బచ్చన్ బదులిచ్చారు. అభిషేక్ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఆయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. “ఇదే నిజమైన బచ్చన్ వారసుడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక కొద్ది రోజులుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులకి సంబంధించి కూడా నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. వీటిపై కొన్ని సార్లు అభిషేక్ స్పందించిన కూడా ఆ రూమర్స్ ఆగలేదు. ఈ మధ్య విడాకులపై జోరుగా సాగుతున్న చర్చలకి అభిషేక్ కాని,ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీ నుండి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. కాకపోతే పలు సందర్భాలలో వారు కలిసి కనిపించడంతో ఆ రూమర్స్‌కి చెక్ పడ్డట్టు అవుతుంది.