Mahakali | ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతున్నది. అయితే ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరోచిత్రం ‘మహాకాళి’. పూజ అపర్ణ కొల్లూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఇండియా నుంచి వస్తున్న తొలి ఫీమేల్ సూపర్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రమేష్ దుగ్గల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నామ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ రోల్లో నటిస్తున్న కథానాయిక ఫొటోను మేకర్స్ విడుదల చేశారు. కన్నడ నటి భూమిశెట్టి ఈ చిత్రంలో మహాకాళి పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో మహాకాళిగా భూమిశెట్టి ఉగ్ర రూపంలో కనిపిస్తుంది.
బెంగాల్ నేపథ్యంలో కాళీదేవి ప్రధానంగా నడిచే కథాంశమిదని, భారతీయ మహిళ సాధికారత, విశ్వాసం, ధైర్యానికి ప్రతీకలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఐమాక్స్ త్రీడీలో కూడా ఈ సినిమాను చూడొచ్చని, భారతీయ, విదేశీ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్‌సాయి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, రచయిత: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు.
From the cosmic womb of creation awakens the most FEROCIOUS SUPERHERO of the universe!
Introducing #BhoomiShetty as MAHA ❤️🔥 #Mahakali 🔱 @RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/MSyyW1oUK2
— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2025