Harvesters | నర్సాపూర్, అక్టోబర్ 30 : మొంతా తుఫాను దెబ్బకు హార్వెస్టర్ల (వరి కోత మిషన్లు)కు పనులు లేకుండా పోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ బిజీగా ఉండాల్సిన హార్వెస్టర్లు ఊహించని విధంగా మొంథా తుఫాన్ ధాటికి పనులు లేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వరి కోత పనులు లేక హార్వెస్టర్లు రోడ్డు పక్కనే నిలిచిపోవడం జరిగింది. కేవలం గొల్లపల్లి గ్రామమే కాకుండా నర్సాపూర్ పట్టణంలో, ఇతర మండలాలలో సైతం హార్వెస్టర్లకు పనులు కురువైపోయాయి.
వరి కోతల సమయంలో ముంచుకొచ్చిన తుఫాన్ వల్ల వర్షాలు కురియడంతో పనులు సాగక హార్వెస్టర్లు మూలన పడ్డాయి. సీజన్లో హార్వెస్టర్లు దొరక్క రైతులు డబ్బులు అధికంగా చెల్లించి మరి వరి కోత చేపట్టేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. తుఫాన్ వల్ల వర్షాలు పడడంతో నేల సహకరించక హార్వెస్టర్లను ఆశ్రయించడంలో రైతులు వెనకాడుతున్నారు. ఒకవేళ వరి కోతలు పట్టినా ఈ తుఫాను ప్రభావం వలన ఎక్కడ ధాన్యం తడిసిపోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
హార్వెస్టర్లతో పంటను కోసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి అనువైన వాతావరణం లేకపోవడంతో రైతులు హార్వెస్టర్ వైపు చూడడం మానేశారు. హార్వెస్టర్ల యజమానులకు ఇది ఒక రకంగా నష్టంగా చెప్పవచ్చు. యజమానులకే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అద్దెకు తెచ్చుకున్న హార్వెస్టర్ డీలర్లకు కూడా పనులు లేక దిగులు చెందుతున్నారు.

Hot Fish Curry: భార్య ముఖంపై వేడి చేపకూర చల్లిన భర్త
Quality Seeds | నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి .. రైతులకు అవగాహన