నార్నూర్ : నాణ్యమైన విత్తనలతోనే ( Quality Seeds ) పంట దిగుబడి వస్తుందని మాజీ జడ్పీటీసీ రూపావంతి జ్ఞానోబా పుష్కర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి హెచ్ గ్రామంలో సీడ్స్ క్రాఫ్ట్ అగ్రి జెనెటిక్ కంపెనీ ఆధ్వర్యంలో విత్తనాల సాగుపై అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ రైతులు మోసపోకుండా ప్రభుత్వం గుర్తించిన కంపెనీల ద్వారా విక్రయిస్తున్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి పంట సాగు చేయాలని సూచించారు. పంట సాగు చేసేటప్పుడు వ్యవసాయ అధికారులు, విక్రయించే డీలర్ల సలహా సూచనలు తప్పకుండా పాటించాలన్నారు.
ఈ ఏడాది జమీందార్ పత్తి విత్తనాలు వేసుకున్న రైతుల పంటలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. ఒక్క మొక్కకు కనీసం 80 నుంచి 100 పూతకాత కాసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెల్స్ అధికారి రవి, రైతులు రాములు, తెలంగాణ రావు, డీలర్స్ ఉన్నారు.