శుక్రవారం 22 జనవరి 2021
Business - Jan 14, 2021 , 03:09:18

ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో

ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో

  • 18 నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ, జనవరి 13: రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) పబ్లిక్‌ ఆఫరింగ్‌కు రాబోతున్నది. ఈక్విటీ షేరు ధరను రూ.25 నుంచి రూ.26 మధ్యలో నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన 178.2 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా  గరిష్ఠంగా రూ.4,600 కోట్ల వరకు నిధులను సమీకరించాలని చూస్తున్నది. ఈ నెల 18 నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో 59.4 కోట్ల షేర్లను విక్రయించనుండగా, 118.8 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనున్నారు.  దీంట్లో ప్రభుత్వ వాటా కింద కేంద్రానికి రూ.1,544 కోట్ల నిధులు సమకూరనున్నాయి.  

సెయిల్‌లో 10% వాటా విక్రయం

మరో ప్రభుత్వరంగ సంస్థ సెయిల్‌లో 10 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో గురువారం విక్రయించబోతున్నది. నాన్‌-రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 14న షేర్లను విక్రయించనుండగా, ఆ మరుసటి రోజు రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం విక్రయించనున్నది. ప్రస్తుతం సంస్థలో కేంద్రం 75 శాతం వాటా కలిగివున్నది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూట్‌లో విక్రయించనున్న షేరు ధరను రూ.64గా నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన 41.3 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా గరిష్ఠంగా రూ.2,664 కోట్లను నిధులను సమీకరించాలనుకుంటున్నది. 


logo