e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ : జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీలలో చేపట్టిన పనులు ఈ నెల 19 లోపు పూర్తి చేయాలి. పంచాయతీ సెక్రటరీలు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్ లో మంగళవారం ఆసిఫాబాద్ డివిజన్ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, కాగజ్ నగర్ డివిజన్ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీలతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీలలో చేపట్టిన నర్సరీలు, సగ్రగేశన్  షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికల్లో పెండింగ్ లో ఉన్న పనులు ఈ నెల 19 లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మండలాల వారీగా గత ఆరు నెలల క్రితమే పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదన్నారు.

- Advertisement -


జిల్లాలో కొన్ని పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు అధ్వానంగా ఉన్నాయని తీరు మార్చుకోకపోతే పంచాయతీ కార్యదర్శి లపై వేటు తప్పదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రితో పాటు, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు పల్లె ప్రగతి పనుల పర్యవేక్షణకు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని ప్రతి పంచాయతీ లో పనులు పూర్తి కావాలన్నారు.

పంచాయతీ సెక్రటరీలు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం 6 గంటల వరకు తాము చేసిన చేయబోయే పనులు అందులో పోస్ట్ చేయాలన్నారు. మండలాల ఎంపీడీవోలు ప్రతిరోజు టూర్ డైరీ నిర్వహించుకోవాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనంలో 100 శాతం మొక్కలు బతికేలా చూడాలన్నారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత

ఈటలవి స్వార్థపూరిత రాజకీయాలు

రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం

శ్రీలంక పర్యటనకు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఖరారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana