Ramavaram MCH | భద్రాద్రి జిల్లాలో విషాదం.. రామవరం ఎంసీహెచ్‌లో బాలింత మృతి
Ramavaram MCH | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రం(Ramavaram MCH) (ఎంసీహెచ్)లో ఓ బాలింత(Woman dies) మృతిచెందిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రం(Ramavaram MCH) (ఎంసీహెచ్)లో ఓ బాలింత(Woman dies) మృతిచెందిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇదే జిల్లాలోని జూలూరుపాడు మండలం టాక్యాతండాకు చెందిన బానోత్ చంద్ర (27) మొదటి కాన్పు ప్రసవం కోసం బుధవారం ఉదయం ఎంసీహెచ్‌లో చేరింది.
పరీక్షించిన అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేశారు.
పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం బాలింతకు రక్తస్రావం ఆగకపోవడంతో వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో చంద్ర మృతి చెందింది.
అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మరణించిందంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ప్రసవ సమయంలోనే ఆమెకు అధిక రక్తస్రావం జరిగిందని, దానికితోడు కార్డియాక్ అరెస్ట్ అయిందని, అందువల్లనే ఆమె మరణించిందని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

