యూపీఐ, రూపేకార్డు చెల్లింపులపై చార్జీలు

- రంగంలోకి దిగిన సీబీడీటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పలు పేమెంట్ గేట్‌వే సర్వీస్ ప్రొవైడర్లు యూపీఐ, రూపే కార్డ్ లావాదేవీలపై చార్జీలు వసూలు చేస్తుండటంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రంగంలోకి దిగింది. చార్జీల వసూలుపై వివరణ ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరింది. యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై వసూలు చేసిన చార్జీలను తిరిగి చెల్లించాలని గతేడాది ఆగస్టులో అన్ని బ్యాంకులను సీబీడీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రెండు మాధ్యమాల్లో చెల్లింపులకు చార్జీలు వసూలు చేయరాదని 2019 డిసెంబర్లో కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అయితే పేమెంట్ సదుపాయం కల్పిస్తున్న వారికి పరిహారం చెల్లించకుండాచార్జీల వసూలుపై నిషేధం విధించటాన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు రిజర్వ్‌బ్యాంకు గత వారం ప్రకటించింది. చిరు వర్తకులకు మాత్రమే ఉచితంగా సేవలు అందించగలమని సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నారు.
తాజావార్తలు
- పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం.. లక్ష్య టీజర్
- హరితేజకూ హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు..!
- వరల్డ్ రికార్డ్.. ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూశారా.. వీడియో
- తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు
- సీఎం పదవి ప్రతి నాయకుడి కల.. నేనూ అంతే
- మంచి మీల్, ప్రేమానురాగాలు ఉంటే చాలు: రేణూ దేశాయ్
- వరుసపెట్టి పేలిన 50 డైనమైట్లు..
- అర్ధరాత్రి కోహ్లి మీటింగ్.. మెల్బోర్న్ టెస్ట్‌కు ముందు ఏం జరిగింది?
- మరికాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
- ఆస్పత్రి వద్ద బాంబు.. భయపడ్డ రోగులు