సోమవారం 08 మార్చి 2021
Business - Dec 17, 2020 , 00:15:47

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌

  • 30 రోజుల వ్యాలిడిటీ
  • ధర రూ.199, రోజుకు 2జీబీ డాటా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్రీపెయిడ్‌ రీచార్జి ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.199 ధరతో తీసుకొచ్చిన ఈ బేస్‌ ప్లాన్‌ రోజుకు 2జీబీ డాటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తుంది. అంతేకాకుండా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత సంఖ్యలో వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. అయితే ఈ కాల్స్‌ రోజుకు 250 నిమిషాలకు మించకూడదు. ప్రస్తుతమున్న పీవీ 186 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (28 రోజుల వ్యాలిడిటీ) స్థానంలో 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన రూ.199 ప్లాన్‌ ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది. జనవరి 1 నుంచి పీవీ 186 ప్లాన్‌ అందుబాటులో ఉండదు. ప్రస్తుతం రోజుకు 2జీబీ డాటాను ఆఫర్‌ చేస్తూ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండే ప్లాన్‌ను రిలయన్స్‌ జియో రూ.249కి, ఎయిర్‌టెల్‌ రూ.298కి ఆఫర్‌ చేస్తున్నాయి. మరోవైపు వొడాఫోన్‌ ఐడియా రూ.199 ప్లాన్‌ కింద రోజుకు 1జీబీ డాటాను మాత్రమే అందజేస్తున్నది.


VIDEOS

logo