సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోల్లో ఒకడు జూనియర్ ఎన్టీఆర్. కన్నడలో కొన్ని పాటలు పాడిన తర్వాత అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ ప్రాజక్టుతో పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకునే దిశగా ముందుకెళ్తున్నాడు. తారక్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ఫాలోవర్లను ఖాతాలో వేసుకున్నాడు.
ట్విటర్ లో తారక్ కు ఫాలోవర్ల సంఖ్య 5 మిలియన్ మార్కు దాటింది. ట్విటర్ లో 5 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించిన అతికొద్ది మంది యాక్టర్లలో తారక్ ఒకడిగా నిలిచాడు. ఆసక్తికర విషయమేంటంటే..కొన్ని పోస్టులతో ఈ రేంజ్ లో ఫాలోవర్లు పెరిగిపోయారు. తన సినిమాలను ప్రమోట్ చేసుకునే ప్లాట్ ఫామ్ గా సోషల్ మీడియా ఖాతాలను వినియోగించుకుంటాడు తారక్. ఇక ట్విటర్ లో తారక్ ఫాలో అయ్యే ఒకే ఒక వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే.
ఇవి కూడా చదవండి..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!