సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!

నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో కళ్యాణ్ రామ్ నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. అయితే పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్‌కు ఆ రేంజ్లో హిట్ రాలేదు. చివరిగా ఎంత మంచివాడవురా చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన కళ్యాణ్ రామ్ ఈ రోజు తన తాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన కొత్త మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేశారు.
పురాతన మగధ సామ్రాజ్య పాలకుడు మరియు బుద్ధుని మద్దతుదారు అయిన బింబిసర పేరుతో కళ్యాణ్ రామ్ తన 18వ సినిమా చేస్తున్నాడు. వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్నట్టు తాజా పోస్టర్ బట్టి తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ గెటప్ సరికొత్తగా కనిపిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో క్యాథరిన్ ట్రెసా – సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
చరిత్రను కోల్పోయిన పౌరాణిక భూమిలో నివసించిన ఒక అనాగరిక రాజు కథ ”బింబిసార” సినిమా అని చిత్ర యూనిట్ ప్రకటించింది. చెడు నుండి మంచి వరకు పయనించిన టైమ్ ట్రావెల్ మూవీ అని తెలిపారు. పోస్టర్లో కళ్యాణ్ రామ్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో గంభీరంగా కనిపిస్తున్నారు. యుద్ధంలో తన చేతిలో చనిపోయినవారి శవాల గుట్టపై కూర్చొని చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు.పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంటికి దగ్గర్లోనే టీకా
20 ఏండ్ల కిందటిదైనా దర్యాప్తు చేస్తాం!
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
కరోనా మార్గదర్శకాలు జూన్ 30 వరకు పొడగించిన కేంద్రం
తుఫాను సమయంలో పుట్టిన శిశువులకు ‘యాస్’ పేరు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- kalyan ram
- nkr 18
- Vashist
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

