లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోకు ఖాళీ సమయం చాలా తక్కువగా దొరుకుతుంది. కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు ఆ ఖాళీ సమయం వరకు బాగానే జరిగింది.

పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోకు ఖాళీ సమయం చాలా తక్కువగా దొరుకుతుంది. కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు ఆ ఖాళీ సమయం వరకు బాగానే జరిగింది. బయట లాక్ డౌన్ కూడా ఉండటంతో ఇప్పట్లో సినిమా షూటింగ్స్ చూడలేము. అందుకే ఇంట్లోనే ఉండిపోయాడు పవన్ కల్యాణ్ దానికి తోడు ఈ మధ్యే ఈయనకు కరోనా వచ్చి తగ్గిపోయింది. అందుకే మరి కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్స్ కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే ఈ గ్యాప్ లో పవన్ కల్యాణ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. సంగీతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు పవన్.
నిజానికి ఆయనకు సంగీతంపై చాలా మక్కువ ఉంది. అందుకే తన సినిమాలో పాటలు కూడా పాడుతుంటారు. ఇప్పుడు ప్రొఫెషనల్ అవ్వాలని చూస్తున్నాడు పవర్ స్టార్. నిజానికి తన కొడుకు అకీరా నందన్ కు సంగీతం నేర్పిస్తున్నాడు పవన్ కల్యాణ్ . జూనియర్ పవర్ స్టార్ కోసం ఒక మ్యూజిక్ టీచర్ ను కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ సదరు సంగీతం మాస్టారు అసలు విషయాలు బయట పెట్టింది.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్, అతడి భార్య ఈ మ్యూజిక్ టీచర్ గురించి పవన్ కల్యాణ్ తో ప్రస్తావించారు. దాంతో ఆమెను ఇంటికి పిలిపించి డెమో ఇప్పించాడు పవర్ స్టార్. వారసుడు అకీరా నందన్ తో పాటు పవన్ కల్యాణ్ కూడా డెమో క్లాసులో ఉన్నాడు.
మరికొన్ని రోజులు సీరియస్ గా సంగీతంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు పవన్ కల్యాణ్ . తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న పవన్ , అతడి వారసుడు అకీరాను చూసి మ్యూజిక్ టీచర్ గాల్లో తేలిపోతుంది. తాను ఎప్పటినుంచో పవన్ కల్యాణ్ అభిమానిని అని.. అలాంటిది అతడు ఇంటికి వచ్చి.. సంగీతం నేర్పించడం అనేది కలలో కూడా ఊహించలేదు అని సంతోషం వ్యక్తం చేసింది. ఏదేమైనా పవన్ కల్యాణ్ సంగీతం నేర్చుకోవాలనుకోవడం మాత్రం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఫ్యామిలీతో బర్త్‌డే జరుపుకున్న సూపర్ స్టార్ కృష్ణ
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
Recommended Content by ntnews.comSkip Adటీ20 ప్రపంచకప్, యాషెస్‌లో ఆడటమే నా లక్ష్యం: ఆర్చర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

