బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అయితే సల్మాన్ ఖాన్ కు మాత్రం డబ్బులు బాగానే వచ్చాయని ఇప్పటివరకు ఉన్న టాక్. ఇప్పటికే ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రాధేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. దీంతో కమల్ ఆర్ ఖాన్ పై పరువు నష్టం దావా వేశారు.
ఇదిలా ఉంటే రాధే విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచినట్టు వాళ్లు ట్రోల్స్ చేస్తుండటంతో సల్మాన్ ఖాన్ కీలక నిర్ణజ్ఞం తీసుకున్నాడట. ఇప్పటి నుంచి ఆన్ లైన్ లో తన సినిమాలు విడుదల చేయొద్దని ఫిక్స్ అయ్యాడట. ముంబై సర్కిల్ లో వస్తున్న వార్తల ప్రకారం సల్మాన్ ఖాన్ ఇక తన సినిమాలను కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తాడని అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!