e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News AP CJI : ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రమాణం

AP CJI : ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రమాణం

హైదరాబాద్‌ : (AP CJI) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రమాణం చేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా చేత ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌తోపాటు పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రకు గవర్నర్‌, సీఎం పుష్పగుచ్ఛాలతో అభినందించి శాలువాతో సత్కరించారు.

1964 ఆగష్టు 29 న ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌ఘడ్‌లో జన్మించిన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా.. బిలాస్‌పూర్‌లోని గురుఘసిదాస్‌ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకొన్నారు. రాయ్‌ఘడ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2005 జనవరిలో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదా దక్కింది. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా, రాష్ట్ర అదనపు అడ్వోకేట్‌ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత అడ్వొకేట్ జనరల్‌గా పదొన్నతి పొందారు. ఆ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గానూ పనిచేశారు. 2009 డిసెంబర్‌ 10 న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మిశ్రా.. ఇటీవల ఏపీ హైకోర్టుకు పూర్తిస్థాయి సీజేగా బదిలీపై వచ్చారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

మూడేండ్లుగా తెలంగాణలో అధిక వర్షాలు

జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ల్యాబ్‌ పనులకు శంకుస్థాపన

ఇమ్రాన్‌ఖాన్‌-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?

పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్‌ అధ్యయనం

సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!

లఖింపూర్‌ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు

బేబీ షవర్‌ ఫంక్షన్‌ జరుపుకున్న ఫ్రీదా పింటో

ట్రంప్‌కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement