Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10కి రంగం సిద్ధం.. నాగార్జున పవర్ఫుల్ ప్రోమో వైరల్!
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరో సరికొత్త మైలురాయిని చేరుకోబోతోంది. విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ముగిసిన సీజన్-9లో కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరో సరికొత్త మైలురాయిని చేరుకోబోతోంది. విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ముగిసిన సీజన్-9లో కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ మా విడుదల చేసిన ‘బిగ్ బాస్ తెలుగు 10’ అధికారిక ప్రోమో సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంటోంది. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున తన స్టైలిష్ లుక్, ఎనర్జీతో ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి ప్రోమోను మరింత గ్రాండ్‌గా, భావోద్వేగాలకు దగ్గరగా రూపొందించారు.
ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ.. “బిగ్ బాస్ అంటే ఎన్నో యుద్ధాలు గెలిచిన రాజ్యం మాత్రమే కాదు.. లక్షలాది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం” అంటూ షో ప్రస్థానాన్ని గుర్తు చేశారు. ఈ సామ్రాజ్యాన్ని నడిపేది తాను కాదని, బిగ్ బాస్‌ను ప్రేమించే ప్రేక్షకులేనని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఈసారి ప్రోమోలో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను చూపించారు. సెలూన్ షాపుల నుంచి ఐటీ కార్యాలయాల వరకు, కుటుంబ సభ్యుల నుంచి యువత వరకు అందరూ బిగ్ బాస్ కోసం ఎలా ఎదురుచూస్తారో చూపిస్తూ షో ప్రజల్లో ఎంతటి ఆదరణ సంపాదించుకుందో ప్రతిబింబించారు. ఎమోషన్స్, టాస్కులు, గొడవలు, స్నేహాలు, వినోదం కలగలిసిన ఈ షో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందనే సంకేతాలను ఇచ్చారు.
ప్రోమోలో వినిపించిన “నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్స్” అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రోమోకు లక్షలాది వ్యూస్ రావడంతో పాటు అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక ప్రోమో చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “ఈ ప్రస్థానం మరో కొత్త చాప్టర్‌కు సాక్ష్యం కాబోతోంది. ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం. ఈసారి ఆటలో సవాల్ కాదు… ఆటే సవాల్!” అంటూ ఆయన చెప్పడంతో షోపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే, పదో సీజన్లో కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు, గేమ్ ప్లాన్ గత సీజన్ల కంటే మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు 10’ త్వరలోనే ప్రారంభం కానుండగా, ఈసారి ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

