Lakhimpur Memorial : లఖింపూర్ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు
Lakhimpur Memorial : లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతుల పేరిట స్మారకం నిర్మించేందుకు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంట్ కమిటీ సిద్ధమైంది. ఘటన జరిగిన...

ఘజియాబాద్ : (Lakhimpur Memorial) లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతుల పేరిట స్మారకం నిర్మించేందుకు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంట్ కమిటీ సిద్ధమైంది. ఘటన జరిగిన ప్రాంతంలోనే చనిపోయిన ఐదుగురి విగ్రహాలను ఏర్పాటు చేసి వారి గురించి వివరాలు చెక్కించాలని కమిటీ నిర్ణయించినట్లు గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఈ స్మారకం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో సరిగ్గా పది రోజుల క్రితం జరిగిన హింసలో ఐదుగురు రైతులు చనిపోయారు.
టికునియాలో దాదాపు ఒకే చోట అమరవీర రైతుల స్మారక చిహ్నం నిర్మించనున్నామని, అక్కడ నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ అమరులయ్యారని మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. ఇందు కోసం ఒకటిన్నర, రెండు ఎకరాల భూమి అవసరం అవుతుందని, స్థానిక భూ యజమానులతో మాట్లాడి కొనుగోలు చేస్తామన్నారు. లఖింపూర్ ఖేరీలో ఐదుగురు రైతుల విగ్రహాలతోపాటు మొత్తం సంఘటనను చెక్కించేందుకు నిర్ణయించామని ఆయన వెల్లడించారు. ఈ మొత్తం ఖర్చును ఢిల్లీ గురుద్వారా చెల్లిస్తుందని, ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోమని చెప్పారు.
ఇప్పటివరకు టికునియాతోపాటు మీరట్, ఘాజీపూర్ సరిహద్దులో రైతు స్మారక చిహ్నాలను నిర్మించనున్నట్లు రైతు నేతలు ప్రకటించారు. గత ఏప్రిల్‌లో ఘాజీపూర్ సరిహద్దులో మేధా పాట్కర్‌తో కలిసి రాకేశ్ తికాయత్ స్మారకం నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేయడం విశేషం.
ఇవి కూడా చదవండి..
బేబీ షవర్ ఫంక్షన్ జరుపుకున్న ఫ్రీదా పింటో
ట్రంప్‌కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించిన షుగర్.ఫిట్
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

