Freida Pinto : బేబీ షవర్ ఫంక్షన్ జరుపుకున్న ఫ్రీదా పింటో
Freida Pinto : ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో వెండి తెరపై 2008 లో ఆరంగేట్రం చేసి ఎందరికో అభిమాన నటిగా మారిపోయారు ఫ్రీదా పింటో. ఈ సినిమాతో...

(Freida Pinto) ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో వెండి తెరపై 2008 లో ఆరంగేట్రం చేసి ఎందరికో అభిమాన నటిగా మారిపోయారు ఫ్రీదా పింటో. ఈ సినిమాతో మంచి నటిగా పేరుతెచ్చుకున్న ఫ్రీదా పింటో.. ఆర్ట్ హౌజ్ సంస్థతో జతకట్టి పలు అమెరికా, బ్రిటన్ సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఇంట్రూషన్, నీడిల్ ఇన్ ఏ టైంస్టాక్ సినిమాల్లో నటించారు. అదేవిధంగా 2013 లో ఆమె నటించిన ‘గొరిల్లా’ మ్యూజిక్ వీడియో ఎంతో ప్రజాదరణ పొందింది. 2018 లో లవ్ సోనియా సినిమాకు గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నారు.
ముంబైలో జన్మించిన ఫ్రీదా పింటో.. సాహస ఫొటోగ్రాఫర్ కోరీ ట్రాన్‌తో 2019 లో నిశ్చితార్థం జరిగింది. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ జంట జూన్ నెలలో ప్రకటించారు. కాగా, సన్నిహితుల సమక్షంలో బేబీ షవర్ ఫంక్షన్‌ను ఫ్రీదా ఘనంగా జరుపుకున్నారు. ‘త్వరలో బేబీకి జన్మనివ్వబోతున్నాను. నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను’ అని తన బేబీ షవర్ ఫొటోలను ఇన్స్టాగ్రాం వేదికగా పోస్ట్ చేసి వెల్లడించింది.
ఈ ప్రత్యేక వేడుక ఫొటోల్లో ఫ్రీదా సాధారణ తెల్లటి దుస్తుల్లో.. చెవిపోగులు, డ్యూయల్ నెక్లెస్, గోల్డెన్ బ్యాంగిల్స్ ధరించి అందంగా కనిపిస్తున్నది. ‘ఈ అందమైన బేబీ షవర్‌ను జ్ఞాపకం చేసుకుంటూ నాకు ప్రత్యేక రోజును చేసిన అద్భుతమైన సోదరీమణులకు ధన్యవాదాలు’ అని ఫొటో కింద రాశారు. ఇందులో రిచా చద్దా, నర్గీస్ ఫక్రి పేర్లు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ట్రంప్‌కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించిన షుగర్.ఫిట్
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఆర్థరైటిస్… కీళ్లపై ప్రభావం.. ఇవి పాటిస్తే చాలు హాయి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

