e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News World Arthritis Day : ఆర్థరైటిస్... కీళ్లపై ప్రభావం.. ఇవి పాటిస్తే చాలు హాయి!

World Arthritis Day : ఆర్థరైటిస్… కీళ్లపై ప్రభావం.. ఇవి పాటిస్తే చాలు హాయి!

(World Arthritis Day) ఆర్థరైటిస్ అనేది ఒక సాధారణ రుగ్మత. ఇది నొప్పులు, మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. కీళ్లపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా 65 ఏండ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. అయితే, మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుతం అన్ని వయసుల వారిలో కనిస్తున్నది. భారతదేశంలో 18 కోట్ల పైగా ప్రజలు ఆర్థరైటీస్‌ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.

కీళ్లల్లో ఏదైనా సమస్య త‌లెత్తిన‌ప్పుడు మోకాళ్లు, ఇతర కీళ్లల్లో విపరీతమైన నొప్పి, వాపు, బిగుసుకుపోవడం, నడవడంలో ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా వాటి రూపాన్ని కోల్పోవడంతో పాటు కాలు ఆకృతిలో, నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. కీళ్ల అరుగుదల బాగా ఎక్కువైన తర్వాత కీళ్ల కదలిక కూడా తగ్గిపోతుంది. కండరాలు పటుత్వం కోల్పోయి వ్యవస్థలో అసమానతలు ఏర్పడతాయి. తగినంత శారీరకశ్రమ లేకపోవడం వల్ల కీళ్లకు పోషణ తక్కువ కావడం ఒకవైపు.. అధిక బరువు, స్థూలకాయం వల్ల వాటిపై ఒత్తిడి పెరిగి మరోవైపు.. వెరసి ఆర్థరైటిస్‌ బాధితులు పెరుగుతున్నారు. ఎక్కువ‌గా కూర్చుండి ప‌నిచేసే ఉద్యోగాల కారణంగా కీళ్ల క‌ద‌లిక‌లు త‌గ్గిపోయి.. ప‌నిచేయ‌క‌పోవ‌డం, గ‌ట్టిప‌డ‌టం చూస్తుంటాం.

ఎలాంటి సమస్యలొస్తాయి..?

- Advertisement -

ఆర్థరైటీస్ 100 ర‌కాలు ఉంటుంద‌ని గుర్తించిన‌ప్పటికీ … సాధార‌ణంగా ఆస్టియో ఆర్థరైటీస్‌, రుమ‌టాయిడ్ ఆర్థరైటీస్‌, సోరియాటిక్ ఆర్థరైటీస్‌, గౌట్‌, ల్యూప‌స్‌.. అని ఐదు ర‌కాలుగా ఉంటుంది. చేతులు, కాళ్లు క‌దిలించ‌లేక‌పోవ‌డం, న‌డ‌వ‌డంలో ఇబ్బంది, కూర్చుండి లేవ‌లేక‌పోవ‌డం, ఏదైనా వ‌స్తువుల‌ను స‌రిగా ప‌ట్టుకోలేక‌పోవ‌డం వంటి స‌మ‌స్యలు వస్తుంటాయి. జాయింట్లలో వ‌చ్చే ఇన్‌ఫెక్షన్ల కార‌ణంగా కూడా ఆర్థరైటీస్ స‌మ‌స్య క‌నిపిస్తుంది. డిస్‌లొకేషన్, సికిల్ సెల్ డిసీజ్, బోన్ ట్యూమర్స్, బ్లీడింగ్ డిజార్డర్స్ వంటివి కూడా కారణమవుతుంటాయి.

మరేం చేయాలి..?

 • కీళ్ల స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఎముక‌ల‌కు కాల్షియం, డీ విట‌మిన్ అందేలా ఆహారాలు తీసుకోవాలి.
 • ఫైబ‌ర్ ఎక్కువ‌గా ల‌భించే ముడి గింజలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
 • అరటి పండ్లలో ఉండే పొటాషియం ఎముకల సాంద్రతను పెంచి, మెగ్నీషియం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 • చేపల్లో దొరికే ఒమెగా ౩ ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను పోగొడతాయి. కీళ్లను దృఢంగా చేస్తాయి.
 • నారింజ పండ్లను తిన‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల సమస్యను పోగొట్టుకోవచ్చు.
 • పీనట్‌ బటర్ లో సమృద్ధిగా ఉండే విట‌మిన్ డీ3 ఎముకలకు ఎంతో అవసరం.
 • కీళ్లనొప్పుల‌ను మ‌టుమాయం చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డే ఈ- విట‌మిన్ కోసం ప‌చ్చి రొయ్యల‌ను ఎక్కువ‌గా తినాలి. ఆరోగ్యకరమైన బరువు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
 • ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోకుండా చూసుకోవాలి.
 • కంప్యూటర్లపై పనిచేసే వారు ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి లేచి నిల్చోవాలి.
 • నడక, సైక్లింగ్‌, ఈత వంటి వ్యాయామాలను ఎంచుకోవడం మంచిది.
 • మందులు, ఫిజికల్‌ థెరపీకి లొంగనప్పుడు మాత్రమే ఆర్థరైటిస్‌కు సర్జరీ అవసరమవుతుంది.
 • శరీరంలోని కొన్ని కీళ్లకు టోటల్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ చేయాల్సి వస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

పెరిగిన పెట్రో ధరలతోనే కొవిడ్‌ వ్యాక్సిన్లు : కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి

పెద్ద మొత్తం డాలర్లతో అష్రఫ్‌ ఘనీ పరారీ.. ఆధారాలు ఉన్నాయంటున్న సెక్యూరిటీ చీఫ్‌

మృత్యువు ముంగిట.. తండ్రిని కలిసిన కొడుకు

లఖింపూర్‌ మృతులకు నివాళులు.. సీతాపూర్‌లో ప్రియాంక అడ్డగింత

శ్రీనగర్‌లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు

స్పేస్‌ సూట్‌ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement