Ashraf Ghani : పెద్ద మొత్తం డాలర్లతో అష్రఫ్ ఘనీ పరారీ.. ఆధారాలు ఉన్నాయంటున్న సెక్యూరిటీ చీఫ్
Ashraf Ghani : ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాబూల్ నుంచి పారిపోతూ తనతో పెద్ద మొత్తంలో డాలర్లను తీసుకెళ్లాడు. డిఫెన్స్ మీటింగ్‌లో...

కాబూల్ : (Ashraf Ghani) ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాబూల్ నుంచి పారిపోతూ తనతో పెద్ద మొత్తంలో డాలర్లను తీసుకెళ్లాడు. డిఫెన్స్ మీటింగ్‌లో పాల్గొనాల్సిన ఘనీ.. ఎవరికీ చెప్పాపెట్టకుండా డబ్బు సంచులతో విమానమెక్కి విదేశాలకు చెక్కేశాడు. ఈ విషయాన్ని కాబూల్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఇదివరకే వెల్లడించింది. కాగా, ఇప్పుడు ఘనీ మాజీ భద్రతా చీఫ్ కూడా ఈ ఆరోపణను ధ్రువీకరించారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను గత నెల ప్రారంభంలో ఘనీ ఖండించాడు. కాబూల్ నుంచి బయల్దేరినప్పుడు జత బట్టలు మాత్రమే తీసుకెళ్లానని చెప్పాడు. ఘనీ మాటలను ఖండించిన మాజీ సెక్యూరిటీ అధికారి, తన వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు వీడియో రూపంలో ఉన్నాయని, వాటిని ఒక ప్రాంతంలో జాగ్రత్త చేసినట్లు వెల్లడించారు.
అబ్దుల్ ఘనీ వద్ద సెక్యూరిటీ చీఫ్‌గా పనిచేసిన బ్రిగేడియర్ జనరల్ పిరజాత షరీఫీ, తాజాగా ఈ ఆరోపణలు చేయడమే కాకుండా తన వద్ద వీడియో రికార్డింగ్ ఆధారాలు ఉన్నాయంటున్నాడు. ఆగస్టు 15 న కాబూల్ నుంచి పారిపోతున్న సమయంలో ఘనీతోనే ఉన్నానని షరీఫీ తెలిపాడు. తాలిబన్ కాబూల్‌తో పాటు మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో షరీఫీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బ్రిటీష్ వార్తాపత్రిక ‘ది డైలీ మెయిల్’ కి పేరు వెల్లడించని ప్రదేశం నుంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఘనీ దేశ ప్రజలకు అబద్ధం చెప్పలేడని షరీఫీ చెప్పారు.
షరీఫీ వెల్లడించిన సమాచారం ప్రకారం, అష్రఫ్ ఘనీ కాబూల్ నుంచి పారిపోతూ తనతో పాటు బ్యాగుల్లో కోట్ల విలువైన డాలర్లతో పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నా దగ్గర ఉన్నది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అందిన ఫుటేజ్‌లో ఒక వ్యక్తి ఆఫ్ఘన్ బ్యాంక్ నుంచి చాలా నగదు తీసుకువెళ్తున్నట్లు కూడా కనిపిస్తున్నది. దీని తర్వాత ఘనీ కాబుల్‌ను విడిచిపెట్టాడు. ఆగస్టు 16 న దేశం నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. అప్పటి నుంచి మా 14 మంది కుటుంబ సభ్యులు, తాలిబాన్ నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఇలాఉండగా, షరీఫీని పట్టుకునేందుకు తాలిబాన్ అవార్డు ప్రకటించి పోస్టర్లు కూడా వేసింది. అయితే, ఇంతవరకు షరీఫీ ఎక్కడ ఉన్నదీ తాలిబాన్ గుర్తించలేదు.
ఇవి కూడా చదవండి..
మృత్యువు ముంగిట.. తండ్రిని కలిసిన కొడుకు
లఖింపూర్ మృతులకు నివాళులు.. సీతాపూర్‌లో ప్రియాంక అడ్డగింత
శ్రీనగర్‌లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు
స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
నీటి శుద్ధి కోసం ‘హైడ్రోజెట్ ట్యాబ్లెట్’.. సిద్ధం చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

