చరిత్రలో ఈరోజు : స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
Today History : అంతరిక్షం పరిశోధనల్లో పైచేయి సాధించేందుకు సోవియట్ యూనియన్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా తొలిసారి 1964 లో సరిగ్గా ఇదే రోజున...

(Today History) అంతరిక్షం పరిశోధనల్లో పైచేయి సాధించేందుకు సోవియట్ యూనియన్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా తొలిసారి 1964 లో సరిగ్గా ఇదే రోజున స్పేస్ సూట్ ధరించకుండా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి సోవియట్ యూనియన్ చరిత్ర సృష్టించింది. వోస్కోడ్-1 ప్రయోగం ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకున్నది.
అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా-సోవియట్ యూనియన్ మధ్య రేసులో సోవియట్ యూనియన్ కొత్త రికార్డు సృష్టించింది. వోస్కోడ్-1 ను సోవియట్ యూనియన్ ప్రయోగించి.. మొదటిసారిగా వ్యోమగాములు స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి పంపింది. నిజానికి, వోస్టాక్ అంతరిక్ష నౌక ద్వారా యూరీ గగారిన్‌ను అంతరిక్షంలోకి పంపి పోటీకి సోవియట్ యూనియన్ తెర లేపింది. వోస్కోడ్ -1 పైలట్‌గా వ్లాదిమిర్ కొమరోవ్ వ్యవహరించగా.. ఆయనతో పాటు శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ ఫియోక్టిస్టోవ్, వైద్యుడు బోరిస్ యెగోరోవ్ ఉన్నారు. ఈ నౌక అంతరిక్ష ప్రయాణంలో అనేక రికార్డులు సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష నౌక. వ్యోమగాములు ఎలాంటి స్పేస్ సూట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రపంచంలోనే ఎక్కువ మందిని తీసుకెళ్లిన తొలి అంతరిక్ష నౌక. శాస్త్రవేత్త, వైద్యుడు అంతరిక్ష యాత్రకు వెళ్లడం వంటి రికార్డులను సొంతం చేసుకున్నది.
ఏదేమైనా, అంతరిక్ష రంగంలో సాధించిన ఈ ఘనతను క్లెయిం చేయడంలో.. సోవియట్ యూనియన్ వ్యోమగాముల భద్రతను మరిచిపోయిందని ఆరోపణలు వినవచ్చాయి. వాస్తవానికి, అమెరికా జెమిని-2 అంతరిక్ష యాత్రకు ముందు వోస్కోడ్ -1 ప్రయోగించాలని సోవియట్ యూనియన్ కోరుకున్నట్లుగా కొన్ని నివేదికల ద్వారా తెలుస్తున్నది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2011 : ఇండియా-వియత్నాం ఒప్పందంపై సంతకాలు చేసిన మన్మోహన్ సింగ్, వియత్నాం అధ్యక్షుడు ట్రూంగ్ టాన్ సాంగో
2007 : అమెరికా మాజీ అధ్యక్షుడు అల్ గోర్, యూఎన్ ఐపీసీసీకి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రదానం
2008 : సిస్టర్ అల్ఫోన్సాకు సెయింట్ హోదా
2004: ఘోరీ-1 క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్
2001: ఐక్యరాజ్య సమితి, దాని సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్‌కు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటన
2000: ఫ్లోరిడా నుంచి అంతరిక్షానికి బయల్దేరి వెళ్లిన అంతరిక్ష నౌక డిస్కవరీ
1999: పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చిన జనరల్ పర్వేజ్ ముషారఫ్
1967: భారత స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా మరణం
1911: భారతీయ క్రికెటర్ విజయ్ మర్చంట్ జననం
1860: చైనా రాజధాని బీజింగ్‌ను స్వాధీనం చేసుకున్న బ్రిటిష్, ఫ్రెంచ్ దళాలు
ఇవి కూడా చదవండి..
నీటి శుద్ధి కోసం ‘హైడ్రోజెట్ ట్యాబ్లెట్’.. సిద్ధం చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
గ్యాస్ సిలిండర్ ధర రూ.2,657 కిలో పాలపొడి రూ.1,200
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ఫార్ములాను దొంగిలించిన రష్యా గూఢచారులు : ది సన్ నివేదిక
ప్రాక్టీస్ చేయకుండా 9 వేల మంది లాయర్లపై నిషేధం.. ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

