గ్యాస్ సిలిండర్ ధర రూ.2,657 కిలో పాలపొడి రూ.1,200

ఆహార సంక్షోభంతో శ్రీలంకలో నిత్యావసరాల ధరలు భగ్గు
కొలంబో, అక్టోబర్ 11: ఆహార సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడు తున్నది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పాలపొడి ధర రూ.1,195కు చేరింది. సిలిండర్ ధర రూ.2,657కు పెరిగింది. చక్కెర, గోధుమ పిండి, బియ్యం, సిమెంటు ఇలా ప్రతీదాని ధర రెట్టింపు, అంతకంటే ఎక్కువగా పెరిగింది. నిత్యావసరాల ధరలపై ఇప్పటి వరకు ఉన్న నియంత్రణను ఎత్తివేయడమే ఇందుకు కారణం. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొవిడ్‌తో తీవ్రమైంది. డబ్బు లేక దిగుమతులు తగ్గాయి. ఇది ఆహార సంక్షోభానికి దారితీసింది. ఇదే సమయంలో కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వం నిత్యావసరాల ధరలపై నియంత్రణ విధించింది. వ్యాపారులు నిత్యావసరాలను అమ్మకుండా నిల్వ చేసుకొన్నారు. సెప్టెంబర్‌లో ఎమర్జెన్సీ విధించినా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో అధ్యక్షుడు రాజపక్స అధ్యక్షతన సమావేశమైన శ్రీలంక క్యాబినెట్ ధరలపై నియంత్రణను ఎత్తేయాలని నిర్ణయించింది. అలాగైనా వ్యాపారుల దగ్గర నిల్వ ఉన్న ఆహార పదార్థాలు మార్కెట్లోకి వస్తాయని, ఆహార సంక్షోభం తీరుతుందని భావించింది. అయితే, ధరలు భారీగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

