Kashmiri Pandits : శ్రీనగర్‌లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు
Kashmiri Pandits : ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని కశ్మీరీ పండిట్లు సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. లాల్ చౌక్‌లో చేపట్టిన...

శ్రీనగర్ : (Kashmiri Pandits) ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని కశ్మీరీ పండిట్లు సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. లాల్ చౌక్‌లో చేపట్టిన ఈ ప్రదర్శనలో స్థానిక ముస్లింలు కూడా పాల్గొని కశ్మీరీ పండిట్లకు మద్దతు తెలిపారు. ఎక్కడ ఉన్నా కలిసి ఉందామని.. ఇంకా ఎంత కాలం వరకు అంటూ బ్యానర్లు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కశ్మీర్‌లోని ముస్లిమేతరులకు భద్రత కల్పించేందుకు ముస్లిం సమాజం ముందుకు రావడం శుభపరిణామం. ముస్లింలు కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడటం విశేషం. ఉగ్రవాద బాధితుల కుటుంబాల బాధను పంచుకోవడానికి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ముస్లిమేతరులు ఎవరూ కశ్మీర్ వదిలి పోవద్దంటూ శ్రీనగర్‌లోని రెండు ప్రధాన మసీదుల ఇమామ్‌లు పిలుపునిచ్చారు.
ఇటీవల పెరిగిపోయిన ఉగ్రదాడులకు వ్యతిరేకంగా శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద కశ్మీరా పండిట్లు శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోడులు, సీనియర్ సిటిజన్లు కూడా ఇందులో పాల్గొని ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవలి హత్యలను కశ్మీర్లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. ముస్లిమేతరులు ఎవరూ శ్రీనగర్ విడిచిపోవద్దని కోరారు. కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల సంస్థల్లో అతిపెద్దదైన ఐజాక్ చైర్మన్ రఫీక్ రథర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, కశ్మీరీ పండిట్లు నివసించే ప్రాంతాలను సందర్శించడం ద్వారా వారికి ధైర్యాన్ని అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
నీటి శుద్ధి కోసం ‘హైడ్రోజెట్ ట్యాబ్లెట్’.. సిద్ధం చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
గ్యాస్ సిలిండర్ ధర రూ.2,657 కిలో పాలపొడి రూ.1,200
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ఫార్ములాను దొంగిలించిన రష్యా గూఢచారులు : ది సన్ నివేదిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

