DC vs KKR : ప్లే ఆఫ్స్ బెర్తు చేజారిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఈడెన్ గార్డెన్స్‌లో భారీ స్కోర్ కొట్టింది. కోల్‌కతా నైట్ బౌలర్లను ఉతికేస్తూ ఓపెనర్ కేఎల్ రాహుల్(60) అర్ధ శతకంతో చెలరేగగా.. అక్షర్ పటేల్(39) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడిన ఈ ద్వయం వెనుదిరిగినా.. డెత్ ఓవర్లలో మిల్లర్(28), అశుతోష్ శర్మ(18 నాటౌట్)లు దంచేశారు. ఫలితంగా కోల్‌కతాకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్తు పట్టేయడంతో.. విజయంతో సీజన్‌ను ముగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ రెండొందలు కొట్టింది. ఈడెన్ గార్డెన్స్లోటాస్ ఓడిన ఢిల్లీకి ఓపెనర్లు అభిషేక్ పొరెల్(22), కేఎల్ రాహుల్(60) శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 40 రన్స్ జోడించిన పొరెల్‌ను ఔటైనా కుర్రాడు సహిల్ పరాఖ్(25), రాహుల్ దూకుడుగా ఆడారు. దంచేస్తున్న ఈ జంటను నరైన్ విడదీయడంతో వచ్చిన అక్షర్ పటేల్(39) సిక్సర్లతో అలరించాడు.
When KL is in that kind of mood, you literally have to bring out Anu𝗞u𝗟 😉
Updates ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC pic.twitter.com/QjMyPJmruA
— IndianPremierLeague (@IPL) May 24, 2026
అర్ధ శతకంతో చెలరేగిన రాహుల్ సారథితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అనుకుల్ రాయ్ ఓవర్లో రాహౌల్ ఔటవ్వగా.. వరుణ్ చక్రవర్తి ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అక్షర్ ఐదో బంతికి ఔటయ్యాడు. అనంతరం డేవిడ్ మిల్లర్(28), అశుతోష్ శర్మ(18 నాటౌట్)లు.. ఢిల్లీ స్కోర్ రెండొందలు దాటించారు. రాహుల్ ఫిఫ్టీ, అక్షర్ మెరుపులతో కోల్‌కతా ముందు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది ఢిల్లీ.
In the arc and Dispatched 🚀
David Miller 🤝 Axar Patel with a crucial partnership 🔥
Updates ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC pic.twitter.com/daP750wXby
— IndianPremierLeague (@IPL) May 24, 2026