కరకగూడెం, మే24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో వడదెబ్బకు ఓ వృద్ధురాలు మృతి చెందింది. తాటిగూడెం గ్రామానికి చెందిన నడ్డి భద్రమ్మ (71) ఎండ తీవ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
తాటిగూడెం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నడ్డి భద్రమ్మ (71) గత కొద్దిరోజులుగా దంచి కొడుతున్న ఎండల తాకిడికి తట్టుకోలేకపోయింది. వడదెబ్బ కారణంగా ఆదివారం సాయంత్రం ఆమె అస్వస్థకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉన్నట్టుండి భద్రమ్మ సొమ్మసిల్లి కింద పడిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, కుటుంబ తను మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. మృతురాలికి భర్త కన్నయ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.