Pooja Hegde | న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో ‘బుట్టబొమ్మ’ పాటకి స్టెప్పులేసిన పూజా హెగ్డే.. వీడియో!
Butta Bomma | అమెరికాలోని న్యూయార్క్‌లో ఘనంగా జరిగిన ‘ఇండియా డే పరేడ్’ (India Day Parade) వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖ నటి పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు గౌరవ అతిథిగా (Guest of Honour) హాజరైన ఆమె, అక్కడి ప్రవాస భారతీయ ప్రజలను ఉత్సాహపరిచారు.
Pooja Hegde | అమెరికాలోని న్యూయార్క్‌లో ఘనంగా జరిగిన ‘ఇండియా డే పరేడ్’ (India Day Parade) వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖ నటి పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు గౌరవ అతిథిగా (Guest of Honour) హాజరైన ఆమె, అక్కడి ప్రవాస భారతీయ ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్‌లోని సూపర్‌హిట్ సాంగ్ ‘బుట్టబొమ్మ’కు లైవ్‌లో డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
న్యూయార్క్ వీధుల్లో పరేడ్ సాగుతున్న సమయంలో పూజా హెగ్డే ఉత్సాహంగా ‘బుట్టబొమ్మ’ హుక్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఈ పాటకు సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించగా, అర్మాన్ మాలిక్, శ్రీకృష్ణ ఆలపించారు. ఈ పాట అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, యూట్యూబ్‌లో ఏకంగా 947 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. న్యూయార్క్ వీధుల్లో వేలాది మంది భారతీయుల మధ్య మన దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పూజా హెగ్డే అభివర్ణించారు.
ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించడంతో పాటు తనకు ఈ అవకాశం కల్పించిన ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్’ (FIA) నిర్వాహకులకు, న్యూయార్క్ అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అందులో ఆమె మన జాతీయ జెండాను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు, న్యూయార్క్ పోలీసు శాఖ (NYPD) కౌంటర్ టెర్రరిజం బ్యూరో అధికారులతో దిగిన చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
సినీ కెరీర్ విషయానికి వస్తే, పూజా హెగ్డే ఇటీవల దళపతి విజయ్ సరసన ‘జన నాయగన్’ చిత్రంలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఆగస్టు 21న ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘కాంచన 4’ చిత్రంలోనూ, అలాగే దుల్కర్ సల్మాన్ తో కలిసి రవి నేలకుడుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ చిత్రంలోనూ ఆమె ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Pooja Hegde attends the India Day Parade 2026 in New York 💛🇮🇳#Pooja #PoojaHegde pic.twitter.com/JKVE1mVuwM
— WV – Media (@wvmediaa) August 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

