ఎల్లారెడ్డిపేట, మే 24: వెంకటాపూర్ శివారులోని ఆదిపెరుమాండ్ల స్వామి ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్కూటీపై వెళ్తున్న అతడు ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని బిక్నూర్ మండలం జంగంపల్లికి చెందిన బక్కి నర్సయ్య(75)గా గుర్తించారు.
స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లికి చెందిన బక్కి నర్సయ్య(75) తన స్కూటీపై సిరిసిల్ల వైపు వెళుతున్నాడు. వెంకటాపూర్‌లోని ఆదిపెరుమాండ్ల స్వామి ఆలయం సమీపంలో స్కూటీ అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు(కామారెడ్డి డిపో)ను నర్సయ్య ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నర్సయ్య అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.