వరంగల్ : మంత్రి కొండా సురేఖ కూతురు కొండ సుష్మితా పటేల్ ( Konda Susmita Patel ) ముఖ్యమంత్రి రేవంత్, అతడి సోదరులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చేసే వ్యాఖ్యలపై స్పందిస్తే మీ జాతకం బయట పెడుతానని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీ చేసి గెలుపొందుతానని ధీమాను వ్యక్తం చేశారు.
బుధవారం మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని,రేవూరి ప్రకాశ్ రెడ్డి కాని, మీ తాత కానీ వచ్చి ఇక్కడ పోటీ చేయండని రేవంత్ కు సవాల్ విసిరారు. అనవసరంగా తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. పరకాల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయించు. తాను అక్కడ పోటీ చేసి గెలుపొందుతానని అన్నారు. రేవూరి తనను రెచ్చగొట్టడం వల్లే తాను సభా వేధిక నుంచి సవాలు విసురుతున్నానని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే
కచ్చితంగా నేనే నిల్చుంటా.. నేనే గెలుస్తా అర్థమైందా
రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఇప్పుడు రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి రేవంత్ రెడ్డి
నేను ఇండిపెండెంట్‌గా నిల్చుంటా.. నీ మీద నేను గెలుస్తా
-… https://t.co/j9FwJaqSkp pic.twitter.com/OyMymtco2x
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026
పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ స్టేట్మెంట్పై ఆమె ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా అలా చెప్పుకోలేదని పేర్కొన్నారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయావ్. ఆ విషయం మరిచిపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి సీతాదయాకర్ ఏమి చేశారని, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇండ్ల పంపిణీలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోను ఎందుకు పెట్టలేదని, బీసీలు అంటే అంత చులకనా?
అంటూ నిలదీశారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బీసీగా ఉండి ఏం చేస్తున్నారని, కొండా మురళీకి ఎందుకు పదవులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేది బయపెట్టాలని డిమాండ్ చేశారు.